ముంబై: మున్నాభాయ్ గా ముద్రపడ్డ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (60) చాలా గ్యాప్ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఆర్ఎస్పీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుస్తోంది. సంజూభాయ్ పొలిటికల్ రీ ఎంట్రీ విషయాన్ని ఆర్ఎస్పీ చీఫ్ మరియు మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జంకర్ బయటపెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మహదేవ్ జంకర్  మాట్లాడుతూ  పార్టీని బలపరిచే క్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ క్రమంలో సంజయ్‌ దత్ ను సంప్రదించామని...పార్టీలో చేరేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 25న సంజయ్ దత్ తమ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌పి పార్టీ మహారాష్ట్రలోని అధికార బిజెపికి మిత్రపక్షం ఉంటోంది. ఇదిలా ఉంటే పొలిటికల్ రీ ఎంట్రీ  విషయాన్ని సంజయ్ దత్ ధ్రువీకరించాల్సి ఉంది. 


సంజయ్ దత్‌కు పొలిటికల్ హిస్టరీ చూసినట్లయితే ...ఆయన రాజకీయాలు కొత్తేం కాదు. సంజూ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ముంబై నార్త్ వెస్త్ లోక్ సభ నియోవర్గానికి ఐదు పర్యయాలు ఎంపీగా సేవలందించారు. ఈ క్రమంలో మన్మోహన్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం సంజయ్ దత్ ఎస్పీలో చేరి.. 2009లో లక్నో నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అదే సమయంలో ఆయుధాల కేసులో దోషిగా తేలడంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.


అనంతరం ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం పనిచేసిన సంజయ్ దత్.. ఆ పదవి నుంచి వైదొలగడంతో పాటు పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ అతడు పోటీ చేస్తాడని వార్తలు వచ్చినా.. అవన్నీ వదంతులేనని సంజయ్ తోసిపుచ్చారు. మరి ఆర్ఎస్పీ లో చేరికపై సంజయ్ దత్ ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.