ముంబై: తాను కూడా ముంబైకి వలసవచ్చిన వ్యక్తి కనుక ఇతరుల కష్టాన్ని గుర్తించిన రీల్ విలన్, నటుడు సోనూ సూద్ (Sonu Sood) రియల్ లైఫ్‌లో హీరో అయ్యాడు. దేశంలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ (LockDown 5.0)‌లు పొడిగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో స్వరాష్ట్రానికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, వలసకార్మికులను తన సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే వేలాది మందిని రైలు, బస్సులు, విమాన సర్వీసుల ద్వారా ఇంటికి క్షేమంగా చేర్చిన నటుడు సోనూ సూద్ ఓ రిక్వెస్ట్ చేశాడు.  నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీకు నిజంగానే నా సహాయం అవసరమైతే రిక్వెస్ట్ చేయండి. అంతేగానీ ముందు రిక్వెస్ట్ చేయడం, తర్వాత ఆ దాన్ని డిలీట్ చేయడం లాంటివి చేయవద్దని సోనూ సూద్ కోరాడు. దీన్ని బట్టి వాళ్లు ఫేక్ అని, అనవసరంగా మెస్సేజ్ చేసి రిక్వె్స్ట్ చేసినట్లుగా అతడు గుర్తించాడు. ఇలా చేయడం వల్ల నిజంగానే సాయం పొందాల్సిన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాపడ్డాడు. సాయం అందాల్సిన వ్యక్తుల గురించి ఓసారి ఆలోచించాలని సూచిస్తూ తన ట్విట్టర్ ఖాతా నుంచి నటుడు సోనూ సూద్ సూచించాడు. అందాల నటి కల్పిక గణేష్ Photos



కాగా, మహారాష్ట్ర అధికార కూటమిలో ఒకటైన శివసేన మాత్రం నటుడు సోనూ సూద్‌పై (Shiv Sena On Sonu Sood) విమర్శలు, ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది. సినిమాల్లో డైరెక్టర్ చెబితే చేసినట్లుగానే, రాజకీయంగానూ ఎవరో పొలిటికల్ డైరెక్టర్ ఆడించినట్లుగా సోనూ సూద్ ఆడుతున్నాడంటూ సీఎం ఉద్దశ్ ఠాక్రే సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ సోనూ సూద్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వలస కూలీలు, కార్మికులకు తన వంతు సాయం చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్