లాక్‌డౌన్ వేళ వెలుగులోకి వస్తున్న మరో బ్యూటీ కల్పిక గణేష్. ఆమెను చూస్తే ఇట్టే గుర్తు పడతారు కానీ పేరు మాత్రం చెప్పలేరు. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి మారుతుందని చెబుతోంది కల్పిక గణేష్ (Kalpika ganesh).
ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది నటి కల్పిక గణేష్. హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం హైదరాబాద్ అమ్మాయి Kalpika Ganesh సొంతం. అయితే మొదటి నుంచీ ఫ్రెండ్ పాత్రలు, సిస్టర్ క్యారెక్టర్స్ రావడంతో తన పరిధిమేరకు ఆకట్టుకుంటోన్న కల్పిక గణేష్ లాక్‌డౌన్ సమయంలో అభిమానులకు మరింత చేరువ అవుతోంది. లాక్‌డౌన్ వేళ తనకు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవయ్యే ఛాన్స్ దొరికిందని ఇటీవల తెలిపింది. జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సీత ఆన్ ది రోడ్, సారొచ్చారు సినిమాలతో గుర్తింపు పొందింది. కెరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకోవాల్సి వచ్చింది. కల్పిక గణేష్ (Kalpika Ganesh Photos) ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Image Courtesy: ఈ ఫొటోలను నటి కల్పిక గణేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను ఇక్కడ అందిస్తున్నాం.
Next Gallery