ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు (Sushant Singh Rajput Case)లో ప్రధాన నిందితురాలు, నటి రియా చక్రవర్తి ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Rhea Chakraborty At ED Office) ఆఫీసుకు వచ్చింది. తనకు కొంతగడువు కావాలని కోరుతూ రియా దాఖలు చేసిన పిటిషన్‌ను ఈడీ తిరస్కరించడంతో శుక్రవారం నటి రియా చక్రవర్తి(Rhea Chakraborty)  ఈడీ విచారనకు హాజరైంది. సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా ముంబైలోని ఈడీ కోర్టుకు రాగానే మీడియా ఆమెను సంప్రదించాలని చూసింది. కానీ నటి అవన్నీ దాటేస్తూ ఈడీ ఆఫీసులోకి వెళ్లిపోయింది. 


కాగా, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నగదు, ఆస్తులకు సంబంధించిన అంశం వెలుగులోకి రావడంతో స్పందించిన ఈడీ అధికారులు రియాపై కేసు నమోదు చేశారు. విచారణకు నేడు హాజరుకావాలని నటికి సమన్లు జారీ చేశారు. అయితే తనపై సీబీఐ విచారణ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగేంత వరకు తన వాంగ్మూలం తీసుకోవడాన్ని వాయిదా వేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు విన్నయించుకుంది. అయితే నటి రియా చక్రవర్తి అభ్యర్థనను తోసిపుచ్చడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఈడీ విచారణకు హాజరైనట్లు సమమాచారం.