Aditya L1 Mission: మరి కాస్సేపట్లో ఆదిత్య ఎల్1 ప్రయోగం, హైలైట్ అంశాలివే, సూర్యునికి ఎంత దూరంలో
Aditya L1 Mission: చంద్రయాన్ 3 విజయం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు సూర్యయానంపై దృష్టి సారించారు. ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆదిత్య ఎల్1 మిషన్ మరి కాస్సేపట్లో ప్రయోగించనుంది. మిషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Aditya L1 Mission: చంద్రుని దక్షిణ ధృవంపై గుట్టు విప్పేందుకు పరిశోధనలు కొనసాగించేందుకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 తన పని చేసుకునిపోతోంది. మరోవైపు సూర్యునిపై పరిశోధనలకు మరో ప్రాజెక్టు ఆదిత్య ఎల్1 మరి కాస్సేపట్లో నింగిలో దూసుకెళ్లనుంది.
ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరి కాస్సేపట్లో అంటే ఇవాళ సెప్టెంబర్ 2 ఉదయం 11 గంటల 50 నిమిషాలకు లాంచ్ కానుంది. పీఎస్ఎల్వి సి 57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 నింగిలోకి వెళ్లనుంది. సౌర వ్యవస్థలో భూమి నుంచి సూర్యునికి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లుగా ఉంది. ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై పరిశోధనలు జరిపేందుకు ఎల్1 లాంగ్రేజ్ పాయింట్‌లో అంటే భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించనున్నారు.
ఆదిత్య ఎల్1 మిషన్‌ను ముందుగా భూ కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇది భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ పయనించిన తరువాత ప్రొపల్షన్ వ్యవస్థ ఆధారంగా ఎల్1 పాయింట్ వైపు పయనిస్తుంది. ఆ తరువాత భూమికి ఉండే గురుత్వాకర్షణ ప్రభావం నుంచి బయటపడి ఎల్ 1 కక్ష్యలో చేరుకుంటుంది. లాంగ్రేజ్ అంటే ఎల్1 ప్రాంతానికి చేరుకునేందుకు 125 రోజుల సమయం పట్టనుంది. ఒకసారి కక్ష్యలో చేరుకున్న తరువాత నిమిషానికి ఒక్కొక్క ఫోటో చొప్పున రోజుకు 1440 ఫోటోలు ఇస్రోకు చేరనున్నాయి.
భూమిపై జీవరాశి మనుగడకు కారణం సూర్యుడే. అందుకే సూర్యుడిపై ఏం జరుగుతోంది. ఏం జరగనుంది, సూర్యుడిలానే ఇతర నక్షత్రాల్లో సమాచారం , సౌర గాలులు ఇలా చాలా వివరాలు అధ్యయన చేసేందుకు ఆదిత్య ఎల్ 1 ఉపయోగపడనుంది. ఇదే కక్ష్యలో ఇప్పటికే చాలాకాలంగా నాసా ప్రయోగించిన ఉపగ్రహం పరిభ్రమిస్తోంది.
Also read: Aditya L1 PSLV C-57 count down: ఆదిత్య L1 పీఎస్ఎల్వీ C-57 ప్రయోగానికి కౌంట్ డౌన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook