Kendriya Vidyalayam: కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం.. ఈ పత్రాలు తప్పనిసరి..
Kendriya Vidyalayam Admissions 2024-25: కేంద్రీయ విద్యాలయం సంఘటన్ (KVS) స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటో తరగతి నుంచి 11 తరగతి వరకు 2024-25 అకడమిక్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది
Kendriya Vidyalayam Admissions 2024-25: కేంద్రీయ విద్యాలయం సంఘటన్ (KVS) స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటో తరగతి నుంచి 11 తరగతి వరకు 2024-25 అకడమిక్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది1 వ తరగతికి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 1 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ దరఖాస్తులకు చివరితేదీ ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇక 11వ తరగతికి దరఖాస్తుల స్వీకరణ పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదల తర్వాత మొదలుకానుంది. కేంద్రీయ విద్యాలయాలు 1254 పాఠశాలల్లో ప్రవేశానికి కొత్త అడ్మిషన్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది.
కాగా, ఒకటో తరగతి అడ్మిషన్ పొందుటకు విద్యార్థి వయస్సు కచ్చితంగా 2024 మార్చి 31వ తేదీ వరకు ఆరు సంవత్సరాలు నిండి ఉండాలి. కటాఫ్ డేట్ 2018 ఏప్రిల్ 1. అయితే, రెండో తరగతి నుంచి ఆ పై తరగతి విద్యార్థులు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ పొందుటకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 10న వీరి దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.
ఇదీ చదవండి: యాభై ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు తండ్రైన సీఎం..
బాల్వాటిక రిజర్వేషన్ కోటా..
కిండర్ గార్టెన్ కోసం దరఖాస్తు చేసుకునే పిల్లల వయస్సు మూడు నుంచి ఆరు ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ఇందులో ఎస్సీ 7.5 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ 27 శాతం రిజర్వేష్ లభిస్తుంది.
ముఖ్య అంశాలు..
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఇక ఒకటో తరగతి విద్యార్థుల ఎంపికకు వెయిటింగ్ లిస్ట్ ఏప్రిల్ 19 తదుపరి జాబితా 29, మే 8.
రెండో తరగతి ఆపై చదువున్న విద్యార్థులు కేంద్రీయ విద్యాలయాల ప్రవేశానికి దరఖాస్తుకు విద్యార్థులు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు కొనసాగుతుంది.
ఇదీ చదవండి: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే
కావాల్సిన పత్రాలు..
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి కింది పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి...
పిల్లల జనన ధృవీకరణ పత్రం
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్
పిల్లల పాస్‌ఫోటోలు
నివాస ధృవీకరణ పత్రం
తల్లి లేదా తండ్రి సర్వీస్ సర్టిఫికేట్(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook