ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF ) కామన్ అడ్మిషన్ టెస్ట్ ( AFCAT Exams 2020 ) ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేయడానికి afcat.cdac.in పోర్టల్ విజిట్ చేసి ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ఈ టెస్టును క్లియర్ చేసిన అభ్యర్థులను ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూకు పిలుస్తారు. టెస్టును క్లియర్ చేసిన అభ్యర్థులను అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 25 , 2020 మధ్యలో ఇంటర్వ్యూ తేదీని, వేదికను నిర్ణయించమని కోరుతారు. అయితే గడువు తేదీలోపు ఎవరైనా తేదీ, వేదికను నిర్ణయించకపోతే మాత్రం సిస్టం నిర్ణయిస్తుంది అని అధికారులు తెలిపారు.


ఎంపికైన అభ్యర్థలకు SSB అనేది నవంబర్ 14, 2020 నుంచి ప్రారంభం అవుతుంది.


అభ్యర్థులు తమ ఫలితాలను ( Results ) చెక్ చేయడానికి afcat.cdac.in పోర్టల్ విజిట్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 




AFCAT Exams 2020 Results ఇలా చెక్ చేయండి.


1. ముందు అధికారిక పోర్టల్ afcat.cdac.in విజిట్ చేయండి.


2.  క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఎంచుకోవాలి.


3. AFCAT 02/2020-Cycleపై క్లిక్ చేయండి.


4. ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయండి.


5. పాస్వర్డ్ ఎంటర్ చేయండి




6. కాప్చా ఎంటర్ చేయండి


7. లాగిన్ పై క్లిక్ చేయండి


8. ఫలితాలు మీ కంటి ముందే ఉంటాయి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR