Sanjay Dutt: కేన్సర్ నుంచి కోలుకున్న సంజయ్ దత్

Sanjay Dutt Beats Cancer | బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) కేన్సర్ ను ఓడించాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపాడు సంజయ్.

Last Updated : Oct 21, 2020, 05:26 PM IST
    • అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన సంజయ్ దత్.
    • కేన్సర్ పై విజయం సాధించానని ప్రకటన
    • ప్రార్థనలు ఫలించాయి అని తెలిపిన సంజూ బాబా
Sanjay Dutt: కేన్సర్ నుంచి కోలుకున్న సంజయ్ దత్

Sanjay Dutt Recovered From Cancer | బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) కేన్సర్ ను ఓడించాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపాడు సంజయ్. అభిమానుల ప్రార్థనల వల్ల తను ఇలా త్వరగా కోలుకోగలిగాను అని.. కేన్సర్ పై విజయం సాధించగలిగాను అని తెలిపాడు సంజయ్. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సందేశాన్ని విడుదల చేశాడు సంజూ బాబా.

తన సందేశంలో సంజయ్ దత్ ఇలా రాశారు...
గత కొన్ని వారాలు నాకూ, నా కుటుంబానికి చాలా కష్టంగా గడిచాయి. కానీ దేవుడు తన బలవంతుడైన సైనికుడిని అత్యంత కఠినమైన యుద్ధానికి పంపిస్తాడు. ఈనాడు నా కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా నేను ఈ యుద్ధంలో గెలిచాను అనే సంతోషకరమైన వార్తను మీతో పంచుతున్నాను అని రాశాడు సంజయ్ దత్.

మీ ప్రార్థనల వల్లే...
తను కేన్సర్ ( Cancer ) నుంచి కోలువాలని ప్రార్థనలు చేసిన వారి గురించి సంజయ్ దత్ ఇలా రాశాడు...

ఇదంతా మీ ప్రేమాభిమానాలు, ప్రార్థనలు, నమ్మకం వల్లే సాధ్యం అయింది. నా కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను.ఈ పోరాటంలో నాతో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు అని తెలిపారు సంజయ్.

గత కొంత కాలంగా కేన్సర్ తో బాధ పడిన సంజయ్ దత్ కొంత కాలం ఆసుపత్రిలో చికిత్స పొందారు. దాని తరువాత ఇటీవలే బయటికి వచ్చి తను కేన్సర్ ను జయిస్తాను అని ఒక వీడియోలో తెలిపారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News