woman gang-raped and killed in UP Balrampur: లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా దేశంవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీ (UP) లో మరో దారుణమైన సంఘటన జరిగింది. మృగాళ్ల పైశాచికత్వానికి మరో యువతి బలైంది. ఈ అఘాయిత్యం హత్రాస్‌కు 500కి.మీ దూరంలో ఉన్న బలరాంపుర్‌ (Balrampur Gang Rape)లోని గైసరి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన 22ఏళ్ల దళిత యువతిని కామాంధులు కిడ్నాప్ చేసి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి (Raped) పాల్పడి.. దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆమె చికిత్స కోసం తరలిస్తుండగానే మంగళవారం రాత్రి మార్గమధ్యంలో మరణించింది. గైసరి గ్రామానికి చెందిన దళిత యువతి ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. అయితే మంగళవారం ఆవహ డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు కాలేజీకి వెళ్లింది. ఈ క్రమంలో దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి డ్రగ్స్ (Drugs) ఇచ్చి అత్యాచారానికి ( Rape) పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమెపై తీవ్రంగా దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఆమెను రిక్షాలో ఇంటికి పంపించారని కుటుంబ సభ్యులు తెలిపారు. Also read: Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూతురు కాలేజీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నడవలేని స్థితిలో ఉందని.. వచ్చి రాగానే బతకలేను అంటూ ఏడ్చిందని.. ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మరణించిందని బాధితురాలి తల్లి రోదిస్తూ వెల్లడించింది. అయితే బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు బలరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అయితే ఆమె ఇంటికి వచ్చినప్పుడు చేతికి గ్లూకోజ్ బాటిల్‌తో అపస్మారక స్థితిలో ఉందని.. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించిందని బలరాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్ దేవ్ రంజన్ వర్మ తెలిపారు. Also read: Hathras Gang Rape: హత్రాస్ ఘటనపై సిట్.. న్యాయం చేస్తాం: యోగి


ఇదిలాఉంటే.. హత్రాస్ బాధితురాలు లాగానే బలరాంపూర్ బాధితురాలి అంత్యక్రియలు జరిగినట్లు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి 8.30 గంటలకు యువతి మరణించగా.. రాత్రి 10.30 గంటలకు దహన సంస్కారాలు జరిగాయని స్థానిక మీడియా తెలిపింది. అయితే హత్రాస్ బాధితురాలిని కనీసం కుటంబసభ్యులకు చూపించకుండా.. అర్థరాత్రి 2.30 గంటలకు పోలీసులు బలవంతంగా దహన సంస్కారాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. Also read: Hathras rape case: గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలి తండ్రికి సీఎం ఫోన్