BJP: ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి కొంత బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా తన కాళ్లపై కాకుండా.. టీడీపీ, జేడీయూ వంటి ఊత కర్రల సాయంతో ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ టర్మ్ లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్న మిత్ర పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో జరిగిన శాసన మండలికి జరిగిన ద్వై వార్షిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. అంతేకాదు పోటీ చేసిన 9 స్థానాల్లో విజయం సాధించడం ఈ కూటమికి మంచి బలాన్ని చేకూర్చిందని చెప్పాలి. ఇక విపక్ష కూటమికి చెందిన శివసేన - యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ - శరత్ పవార్ కూటమికి మాత్రం చేదు ఫలితాలనే ఇచ్చిందనే చెప్పాలి. ఈ కూటమికి చెందిన మహా వికాస్ అఘాడికి (ఎంవీఏ) అభ్యర్థులు ఇద్దరే విజయం సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఎన్నికల్లో బీజేపీ - 5 సీట్లు.. శివసేన -2, ఎన్సీపీ -2 సీట్లలో విజయం సాధించింది. శివసేన ఉద్ధవ్ థాక్రే -1, కాంగ్రెస్ పార్టీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్సీపీ మద్దతు ఇచ్చిన స్వతంత్య్ర  అభ్యర్ధి జయంత్ పాటిల్ ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు.


మరోవైపు దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో జరిగిన 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.  7 రాష్ట్రాల్లో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి 10 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు ఒక స్వతంత్య్ర అభ్యర్ధి విజయం సాధించారు. బుధవారం జరిగిన బై ఎలక్షన్స్ ఫలితాలను శనివారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


ఇక పశ్చిమ బెంగాల్ లో జరిగిన నాలుగు స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్ లోని జలంధర్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. తమిళనాడులోని విక్రవాండి నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్ధిపై డీఎంకే 67,757 ఓట్ల తేడాతో గెలుపొందారు.  


హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య  కమలేవ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ బీజేపీపై 9,399 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీలో భార్యా భర్తలు ఇద్దరు ఉండటం విశేషం. ఇక్కడ జరిగిన మరో రెండు నియోజకవర్గాల్లో ఒక దాన్ని కాంగ్రెస్, మరొకటి బీజేపీ గెలిచింది.  మరోవైపు మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న అమర్ వాడా స్థానాన్ని బీజేపీ క్యాండిడేట్ 3,027 ఓట్ల తేడాతో కైవసం చేసుకుంది. అటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవడం విశేషం. అందులో ఓ స్థానాన్ని కేవలం 422 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ వశం అయింది. బిహార్ లోని ఒకే ఒక్క సీటును జేడీయూ పై ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలుపొందారు. మొత్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీని కోలుకోలేని దెబ్బ తీస్తే.. మహారాష్ట్రలోని శాసన మండలి ఎన్నికల్లో గెలుపు పెద్ద ఊరట అని చెప్పాలి.


Also read: Pulasa fish: వలలో చిక్కిన తొలి పులస చేప.. దీనికి జనాల్లో ఎందుకంత క్రేజ్.. పులస కేజీ ధర ఎంతో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.