Pulasa fish: వలలో చిక్కిన తొలి పులస చేప.. దీనికి జనాల్లో ఎందుకంత క్రేజ్.. పులస కేజీ ధర ఎంతో తెలుసా..?

Konaseema district: కొన్ని రోజులుగా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో జోరుగా విస్తరించాయి. దీని ప్రభావం వల్ల పలుచోట్ల భారీగా వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో.. నదుల్లో కూడా కొత్త నీరు వచ్చి చేరుతుంది. కోనసీమలో జిల్లాలోని మత్స్యకారుడి వలకు ఒక పులస చేప చిక్కింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 13, 2024, 01:56 PM IST
  • కోనసీమలలో వలలో చిక్కిన పులస..
  • వేలంపాటకు ఎగబడ్డ జనాలు..
Pulasa fish: వలలో చిక్కిన తొలి పులస చేప.. దీనికి జనాల్లో ఎందుకంత క్రేజ్.. పులస కేజీ ధర ఎంతో తెలుసా..?

First Pulasa fish selling for rs 24 thousand in auction at Ambedkar konaseema: మనలో చాలా మంది నాన్ వెజ్ లను ఎంతో ఇష్టంతో తింటారు. కొందరు మేక, కోళ్లలను ఇష్టంతో తింటుంటే, మరికొందరు మాత్రం.. చేపలను ఇష్టంగా తింటారు. సాధారణంగా చేపలు కేజీ 300 లేదా 400 ఉండోచ్చు. అది కూడా కొన్ని ప్రత్యేకమైన చేపలను బట్టి, రేట్లు మారుతుంటాయి. కొన్ని ప్రత్యేకమైన చేపలు కూడా కాస్లీగా ఉంటాయి. చాలా అరుదుగా లభించే చేపలకు మార్కెట్ లో మంచి రేట్లు ఉంటాయి. ఫుడ్ లవర్స్.. ఎంత కాస్లీ అయిన  కూడా కొన్ని చేపల్ని ఇష్టంతో కొనుగోలు చేస్తుంటారు. అలాంటి కేటగిరిలో ఏపీలో దొరికే పులస చేపలు ఫస్ట్ ఉంటాయని చెప్పుకొవచ్చు.

Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..

ఆంధ్ర ప్రదేశ్ లో దొరికే పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఒక నానుడి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. పుస్తెలు అమ్మైన పులస కూర తినాలని అంటుంటారు. అంటే ఈ చేప రుచి ఏ రేంజ్ లో ఉంటుందో దీన్ని బట్టి అర్ధం చేసుకొవచ్చు. పులస వల్ల టెస్ట్ మాత్రమే కాకుండా.. బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తుంటారు. అందుకే గోదావరిలో మాత్రమే స్పెషల్ గా దొరికే పులసకు అంత డిమాండ్ ఉందని చెప్పుకొవచ్చు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో మత్స్యకారుడి పంటపడింది. 

అప్పన రాముని లంకకు చెందిన స్థానిక మత్స్యకారుడి వలకు భారీ పులస చిక్కింది. గోదావరిలో ఇప్పుడిప్పుడే ఎరుపు నీళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పులస చేపలు ఇప్పుడిక ఎక్కువగా నీళ్లలో కన్పిస్తుంటాయి. ఈ క్రమంలో సదరు మత్స్యకారుడికి పులస చిక్కింది. దీంతో అతని సంతోషానికి మాత్రం అవధులు లేవని చెప్పుకొవచ్చు. ఆ పులస చేప దాదాపుగా.. కేజీన్నర ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని సొంతం చేసుకొవడానికి ఏకంగా అక్కడ వేలంపాటను కూడా నిర్వహించారంటే దాని క్రేజ్ అర్థం చేసుకొవచ్చు. ఈ వేలంపాటలో.. అనేక మంది పోటీపడగా.. అప్పన రాముని లంకకి చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000లు చెల్లించి ఈ పులసను సొంతం చేసుకున్నాడు. 

 కేజీన్నర పులస - రూ. 24 వేలు..

ప్రస్తుతం కోనసీమలో దొరికి పులస చేప గురించి చాలా మంది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ మత్స్యకారుడు సైతం.. తన లక్ మార్చేసిందని పులస అంటు చెప్పుకుంటున్నాడు. అక్కడి వాళ్లు.. ఈ పులస వలలో చిక్కడం కూడా గొప్పగా భావిస్తారు. పులస చిక్కితే ఆ ఏడాదంతా తమకు డబ్బులకు లోటుండదని అక్కడ వాళ్లు నమ్ముతుంటారు. ఈ క్రమంలో  నిన్న చేపల కోసం గోదావరికి వెళ్లిన మత్స్యకారుడికి, భారీ చేపచిక్కింది. అది కూడా ఒకటిన్నర కిలోల భారీ చేప.  ఆ చేప చిక్కిందనే... వార్త పక్క గ్రామాల్లోకి సైతం పాకిపోయింది. దీంతో చేపను సొంతం చేసుకొవడానికి చాలా మంది పోటీపడినట్లు తెలుస్తోంది. కేవ‌లం కేజీన్నర పుల‌స చేప‌ను ఆ మ‌త్స్య‌కారులు ఏకంగా రూ.24 వేల‌కు అమ్మారు.

Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..

కోన‌సీమ జిల్లా మ‌లికిపురం మండ‌లం రామ‌రాజులంక బాడవ‌లో  శ్రీ‌ను అనే మ‌త్స్య‌కారుడు ఉంటాడు. అతను చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.శుక్రవారం రోజున చేపల కోసం వెళ్లగా.. ఈ అరుదైన చేప చిక్కినట్లు వెల్లడించాడు. కేవలం ఈ చేపలు గోదావరి వరద నీళ్లలోనే ఉంటాయని కూడా అక్కడి వాళ్లు చెప్తుంటారు. చాలా అరుదుగా చిక్కడం వల్ల వీటికి ఆ రేంజ్ లో డిమాండ్ ఉంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఈ చేప ఫెమస్ అని చెప్పవచ్చు. ఏపీలో దీన్ని పులస చేప అని పిలుస్తుండగా..  ఇదే చేప స‌ముద్రంలో దొరికితే దానిని వ‌ల‌స చేప అంటారు. హుగ్లీ న‌దిలో కూడా ఈ చేప దొరుకుతుంది. అక్క‌డ హిల్సా అని పిలుస్తారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News