MLA Love Marriage: హాట్ టాపిక్‌గా ఎమ్మెల్యే ప్రేమ వివాహం!
టీనేజీ యువతిని ఎమ్మెల్యే ప్రేమ వివాహం (MLA Love Marriage) చేసుకున్నారు. అది కూడా కులాంతర వివాహం కావడంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ విషయం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
టీనేజీ యువతిని ఎమ్మెల్యే ప్రేమ వివాహం (Kallakurichi MLA Love Marriage) చేసుకున్నారు. అది కూడా కులాంతర వివాహం కావడంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ విషయం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే (AIADMK) పార్టీ కళ్లకురిచి ఎమ్మెల్యే ప్రభు (36) ప్రేమ వివాహం (MLA Prabhu Marriage) చేసుకున్నారు. కులాంతర ప్రేమ వివాహం కావడంతో తమిళనాడులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు ఎమ్మెల్యే ప్రభు.
సౌందర్య అనే టీనేజీ విద్యార్థినిని, ఎమ్మెల్యే ప్రభు సోమవారం ప్రేమ వివాహం (MLA Prabhu Love Marriage) చేసుకున్నారు. ప్రభు, సౌందర్యల వివాహం ఎమ్మెల్యే ఇంట్లో నిరాడంబరంగా జరిగింది. కోవిడ్19 నిబంధనల నేపథ్యంలో కొందరు సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. త్యాగదుర్గం మలైకొటే గ్రామానికి చెందిన సౌందర్య ప్రస్తుతం బీఏ ఇంగ్లీష్ సెకండియర్ చదవుతోంది. సౌందర్య తండ్రి అర్చకుడిగా సేవలందిస్తున్నారు.
ఎమ్మెల్యే ప్రభుకు సౌందర్య గత పదేళ్లుగా తెలుసునని, అయితే గత ఏడాదిన్నర కాలం నుంచి వీరిద్దరూ ప్రేమించుకున్నారని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత టికెట్ ఇవ్వడంతో 2016 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ప్రభు. అయితే అధికార పార్టీలో అవివాహిత ఎమ్మెల్యే అంటే టక్కున ప్రభు పేరు చెప్పేవారట. తాజాగా అన్నాడీఎంకే నేత తన ప్రేమను పెళ్లిగా మలుచుకున్నారు.
- Also Read : Gold Price: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe