'కరోనా వైరస్'..  ప్రభావంతో ప్రపంచమే అల్లకల్లోలం అవుతోంది. ఇప్పటి  వరకు ఈ వైరస్ కు మందులు అందుబాటులో లేవు. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో వైరస్ సోకిన వారు.. సొంత రోగనిరోధక శక్తి పైనే  ఆధారపడాల్సి వస్తోంది. సొంతగా రోగ నిరోధక శక్తి ఉన్న వారు బతికి బయట పడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు వైరస్ మహమ్మారికి బలైపోతున్నారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ఈ వైరస్ అతి కొద్దికాలంలోనే ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఫలితంగా 200 దేశాలు వైరస్ భయంతో గజగజా వణికిపోతున్నాయి.


మరోవైపు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్.. ICMR.. వ్యాక్సిన్  కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు 40 వ్యాక్సిన్లను వారు  తయారు చేశారు. కానీ ప్రస్తుతం అవి అన్నీ పరిశోధన దశలోనే ఉన్నాయి. అటు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్..  AIIMS డైరెక్టర్ .. కరోనా వైరస్ చికిత్సలో కొత్త థెరపీ ప్రతిపాదించారు.  


[[{"fid":"184250","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తాన్ని వాడుకుని కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెబుతున్నారు.  కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను సేకరించి థెరపీలో వాడవచ్చని ఆయన అంటున్నారు. వైరస్ బారిన పడిన తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని.. దాని వల్ల  వైరస్ నుంచి కోలుకుంటారు కాబట్టి.. అలాంటి యాంటీ బాడీలను సేకరించి కరోనా పాజిటివ్ రోగుల చికిత్సలో వాడుకోవచ్చని ఆయన తెలిపారు. శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు రక్తంలోనే ఉంటాయని చెప్పారు. అందుకే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులను రక్తదానం చేయాలని కోరుతున్నామన్నారు. ఫలితంగా ఆ రక్తం నుంచి ప్లాస్మా సేకరించి ఇతరులకు నయం చేయవచ్చని తెలిపారు. 


గతంలో ఎబోలా వైరస్‌కు చికిత్స అందించడంలోనూ ఇలాంటి పద్ధతి వాడారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెబుతున్నారు. ఇప్పుడు ఇదే పద్ధతి మనకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఈ పద్ధతిని సాంకేతికంగా కన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ అని పిలుస్తారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..