దేశ రాజధాని ఢిల్లీలో అద్భుతం జరిగింది. కరోనా వైరస్ ఉన్న ఓ మహిళ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన దేశంలో ఇప్పుడు సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. (AIIMS)లోని  ఫిజియాలజీలో ఓ డాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన రోజూ కోవిడ్ 19 రోగులతో గడుపుతున్నారు. చాలా రోజులుగా పలువురు కరోనా పాజిటివ్ రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన భార్యకు కూడా ఆ మహమ్మారి అంటుకుంది. ఆమె ఇప్పుడు నిండు గర్భిణీ. ఆమెను ప్రసవం కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆమెకు కూడా కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయింది.


దేవుడా.. ఇప్పుడు ఎలా అని తలలు పట్టుకున్న వైద్యులు..  చేసేదేం లేక.. అన్ని రకాల  నివారణ చర్యలు తీసుకుని ఆమెకు ప్రసవం చేశారు. ఐతే ఆశ్చర్యం.. అద్భుతమైన ఘటన  జరిగింది.  పుట్టిన శిశువుకు కరోనా వైరస్ లక్షణాలు లేవు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 


వైద్యులు.. అన్ని రకాలుగా రక్షణ చర్యలు  తీసుకుని ప్రసవం చేయడం వల్ల పుట్టిన శిశువుకు కరోనా వైరస్ సోకలేదని ఎయిమ్స్ మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ డీకే శర్మ  తెలిపారు. ప్రస్తుతం తల్లిని మాత్రం ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అంతే కాదు  శిశువుకు తల్లి పాలు కూడా పట్టవచ్చని తెలిపారు. కరోనా వైరస్ పాల ద్వారా వ్యాప్తి చెందదని వెల్లడించారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..