Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ నోటా మళ్లీ వివాదాస్పద పంద్రా మినిట్ మాట..
Akbaruddin Owaisi: తెలంగాణలోని హైదరాబాద్ పాతబస్తీ వేదికగా రాజకీయాలు చేసే ఒవైసీ సోదరుల్లో చిన్నవాడైన చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి తన నోటి దూల ప్రదర్శించారు. అంతేకాదు ఈ సారి ఏకంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ గా హిందువులపై అనరాని మాటలున్నాడు. ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Akbaruddin Owaisi:మహారాష్ట్ర ఎన్నికల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు MIM అధినేతల్లో ఒకరైన చిన్న ఒవైసీ. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోడీ దేశ ప్రజలను విభజించాలని చూస్తున్నారన్నారు. కానీ MIM అలాంటి మత విధ్వంసకర శక్తులను అడ్డుకుంటుందన్నారు. అంతేకాదు మరోసారి తనకు పదిహేను నిమిషాలు టైమ్ ఇస్తే.. దేశంలోని మెజారిటీ ప్రజలకు తామేంటో చూపిస్తామన్నారు. గతంలో కూడా చిన్న ఒవైసీ తెలంగాణలో నిర్మల్ లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. తీరా ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ సహకరించడం వలన అక్బరుద్దీన్ ఒవైసీ ఈ కేసు నుంచి బయట పడ్టట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా.
ఒక ఒవైసీ బ్రదర్స్ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల అంటకాగుతూ ఉంటారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ అంటకాగిన ఈ సోదరులు.. వాళ్లు అధికారంలోంచి దిగిపోవడంతో ఊసరవెల్లిలా ప్లేటు ఫిరాయించారు. అప్పటి వరకు తిట్టని తిట్టు తిట్టిన కాంగ్రెస్ పంచన చేరారు. ఇక ఎన్నికల ముందు వరకు ఎంఐఎం పార్టీ.. బీజేపీకి బీ టీమ్ అంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత ఎంఐఎంను అక్కున చేర్చుకొని కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్ గా మార్చుకుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
ఇక తెలంగాణలోకి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అంటూ చెరువులు, కుంటల పరిరక్షణ అంటూ కొన్ని అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చినా కూల్చింది. అదే ఒవైసీ సోదరులకు సంబంధించిన ఆస్తుల జోలికి మాత్రం వెళ్లకపోవడం వీళ్ల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ నిదర్శనం అని ప్రతిపక్ష బీజేపీ నేతలు అంటున్నారు. వాళ్లు అంటున్నట్టే తెలంగాణలో ఒవైసీ , కాంగ్రెస్ మధ్య బంధం ఫెవికాల్ ను మించి దృఢంగా తయారైంది. తాజాగా మహారాష్ట్రలో ఒకటి రెండు సీట్లు సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తోన్న ఎంఐఎం .. తాజాగా మరోసారి మెజారిటీ హిందువులపై తన అక్కసును వెళ్లగక్కింది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి. ఇక మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలుబడనున్నాయి. రీసెంట్ గా ఒవైసీ సోదరులు తిరుమల తిరుపతికి వక్ఫ్ బోర్డ్ కు లింకు పెడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.