భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా లిమిటెడ్ కు చెందిన  రూ.2000 కోట్ల విలువైన పాత ప్రధాన కార్యాలయ భవనాన్ని జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టు(జేఎన్‌పీటీ)కు అమ్మకానికి పెడుతున్నట్టు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. వచ్చే మార్చి చివరినాటికల్లా ఈ డీల్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సదరు అధికారి పేర్కొన్నారు. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఈ ఖరీదైన భవనం ఉంది. ప్రస్తుతం జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, ఎయిర్ ఇండియా అధికారులు వేర్వేరుగా ఈ భవనం విలువను అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారని తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పినట్టుగా లైవ్ మింట్ ప్రచురించిన ఓ కథనం పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"173837","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఎయిర్ ఇండియా.. ఆ కష్టాలను అధిగమించేందుకు ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. 23 అంతస్తులు ఉన్న ఈ భవనం మొత్తం 10,000 చదరపు అడుగులకుపైగా వైశాల్యంలో విస్తరించి ఉంది.