Pilots Left Flight Midway: ఎయిర్ ఇండియా ప్రయాణికులు బిత్తరపోయేలా ఆదివారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. లండన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇంటర్నేషనల్ ఫ్లైట్‌ని ఆదివారం ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజస్థాన్‌లోని జైపూర్‌కి మళ్లించారు. వాతావరణం అనుకూలించిన అనంతరం విమానం తిరిగి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే, జైపూర్ వెళ్లిన అనంతరం ఎయిర్ ఇండియా ఫ్లైట్ పైలట్స్ అక్కడి నుంచే విధులు ముగించుకుని వెళ్లిపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ పని వేళలు ముగిశాయని బదులిచ్చారు. దీంతో లండన్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానాన్ని 6 గంటల పాటు జైపూర్ విమానాశ్రయంలోనే పార్క్ చేయాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కనివినీ ఎరుగని ఈ ఊహించని పరిణామానికి బిత్తరపోవడం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రయాణికుల వంతయ్యింది. తాము ఇలా ఎన్ని గంటలపాటు వేచి ఉండాలి అని ప్రయాణికులు అంతా ఏకమై గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. లండన్ నుంచి వచ్చి జైపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఎయిర్ ఇండియా ప్రయాణికులు అంతా తమ చేతుల్లోని మొబైల్స్ తీసుకుని సోషల్ మీడియాలో ఎయిర్ ఇండియాపై మండిపడుతూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది రాజస్థాన్ సర్కారుకు ట్వీట్ చేస్తే.. ఇంకొంత మంది విమానయాన శాఖ మంత్రిని ట్యాగ్ చేస్తూ తమని ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమా అని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. అయితే, ఎవరు ఎన్నివిధాల ప్రయత్నించినా అటు కేంద్రం నుంచి కానీ లేదా ఇటు రాజస్థాన్ సర్కారు నుంచి కానీ తమను ఆదుకునే వాళ్లే కరువయ్యారని ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.


చివరకు ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యక్తమవుతున్న తీవ్ర అసహనం కాస్తా ఆందోళన రూపం దాల్చుతుండటంతో ఆలస్యంగా తేరుకున్న అధికారులు.. ప్రయాణికులను రోడ్డు మార్గంలో జైపూర్ నుంచి ఢిల్లీకి పంపించారు. విమానంలో వచ్చిన తమను ఇలా మార్గం మధ్యలో ఎక్కడికో తరలించి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంపించడం ఏంటంటూ కొంతమంది ప్రయాణికులు అసహనం వెళ్లగక్కారు. జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో తమకి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అని ఇంకొంతమంది ప్రయాణికులు ఎయిర్ ఇండియాను నిలదీశారు.



 


ఇది కూడా చదవండి : Air India Dispute: మరోసారి వివాదంలో ఎయిర్ ఇండియా, చికాగో విమానాశ్రయంలో చిక్కుకున్న 300 మంది ప్రయాణీకులు


లండన్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం AI-112 తో పాటు ఢిల్లీ నుంచి దుబాయ్ కి బయల్దేరిన మరో ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా జైపూర్‌కి దారి మళ్లించారు. ఇవే కాకుండా ఢిల్లీ నుంచి బహ్రెన్ వెళ్తున్న విమానం, పూణే నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం, అలాగే గౌహతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్పైస్ జెట్ విమానాలను కూడా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు అక్కడ వాతావరణం అనుకూలించపోవడంతో ఆయా విమానాలను జైపూర్‌కి మళ్లించారు. జైపూర్ విమానాశ్రయంలో ఆందోళనకు కారణమైన పైలట్స్ పై ఎయిర్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచిచూడాల్సిందే మరి.


ఇది కూడా చదవండి : Air India Issue: మహిళపై మూత్రం పోసిన ఘటనలో ఎయిర్ ఇండియాకు డీజీసీఏ నోటీసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK