ఇలాగైతే డ్యూటీకి డుమ్మా కొడుతామని ఎయిర్ ఇండియా పైలట్స్ హెచ్చరిక
ఎయిర్ ఇండియాకు పైలట్స్ హెచ్చరిక
ఇప్పటికే బిడ్డింగ్‌లో ముందడుగు పడక కష్టాలు ఎదుర్కుంటున్న ఎయిర్ ఇండియాకు తాజాగా సొంత సిబ్బంది నుంచే బెదిరింపులు మొదలయ్యాయి. ఫ్లయింగ్ అలవెన్స్‌ల రూపంలో తమకు ఎప్పటినుంచో రావాల్సి ఉన్న బకాయిలు తక్షణమే చెల్లించకపోతే, తాము విధులకు గైర్జాజరవుతామని ఎయిర్ ఇండియా పైలట్స్ హెచ్చరించారు. సంస్థలోని ఇతర విభాగాల సిబ్బంది అందరికీ జీతభత్యాలు అన్నీ చెల్లించిన ఎయిర్ ఇండియా.. కేవలం పైలట్స్, విమానం సిబ్బందికి మాత్రం ఫ్లయింగ్ అలవెన్స్‌లు ఎందుకు చెల్లించడం లేదని పైలట్స్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఎయిర్ ఇండియా తక్షణమే తమకు రావాల్సిన ఫ్లయింగ్ అలవెన్స్ బకాయిలను చెల్లించకపోతే, పైలట్స్ విధులకు దూరంగా ఉంటారని ఇండియన్ కమెర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) తాజాగా ఎయిర్ ఇండియా ఆర్థిక విభాగం డైరెక్టర్‌కి అల్టీమేటం జారీచేసింది.