న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిన్న కరోనా వైరస్, భారత్ ను తాకిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలాజా మాట్లాడుతూ.. పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం లక్షణాలేమీ లేవని, ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి నమూనాలు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపబడిందని ఆమె తెలిపారు. వైరస్ నమూనాలు నెగెటివ్ అని తేలితే, చికిత్స అందించాడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మరోవైపు చైనాలో ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి తెచ్చే విధంగా వుహాన్ నగరానికి ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. సుమారుగా 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకుభారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపట్టింది. కరోనా వైరస్ బారినపడ్డ వారందరినీ వుహాన్ నగరం నుంచి నేరుగా ఢిల్లీకి తరలించే కార్యక్రమం చేపట్టింది. అయితే చైనాలో చిక్కుకున్న భారతీయుల్లో పలువురు తెలుగువారున్నారని సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా గురుగాం సమీపంలోని మానేసర్ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 


వుహాన్ నుంచి తీసుకొచ్చిన భారతీయులను వైద్య శిబిరంలోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించగా, 14 రోజుల పర్యవేక్షణలో వైరస్ లేదని నిర్ధారణ జరిగితేనే బయటకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. 

ఇండియన్ ఆర్మీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరం, చైనా నుంచి తీసుకొచ్చిన భారతీయులను ఎవరితో కలవకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఇతర ప్రాంతాలకు ప్రబలకుండా ప్రత్యేక వైద్య చర్యలు
చేపట్టనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..