ప్రధాని మోడీకి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించారు. బీజేపీకి బద్ధ శత్రువుగా భావించే ఆయన మద్దతు తెలపడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా ?.. మద్దతు అయితే తెలిపారు కానీ.. ఆ పార్టీకి కాదు.. మోడీ ఇచ్చిన నినాదానికి  వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలికాలంలో ప్రధాని మోడీ తరచుగా ఒక మాట అనే వారు గుర్తుందా.. అదేనండి "వన్ నేషన్ - వన్ ఎలక్షన్". ఎన్నికల భారం నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే ఆలోచనతో మోడీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే దీనిపై ప్రతిపక్షాల  నుంచి సరైన మద్దతు లేకపోవడంతో అది నినాదానికే పరిమితమైంది. అయితే ఇప్పుడు తాజాగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ విషయంలో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో తాను మోడీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని  తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.


అఖిలేష్ ఏమన్నారంటే.. ఒకే నేషన్ ఒకే ఎన్నికలు అనే  మోడీ నినాదానికి మేం మద్దతు ఇస్తు్న్నాం. మేం దానికి సిద్ధంగా ఉన్నాం. యూపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపితే సంతోషిస్తాం. కనీసం ఇలాగైనా యోగి పాలన  నుంచి యూపీ ప్రజలను విముక్తి చేసే దొరుకుంది.