Akshay Kumar Apology: పొగాకు కంపెనీతో కాంట్రాక్టు రద్దు చేసుకున్న అక్షయ్ కుమార్..!
Akshay Kumar Apology: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ పొగాకు కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై తీవ్ర విమర్శలు రావటంతో ఆ కాంట్రాక్టు రద్దు చేసుకున్నాడు.
Akshay Kumar Apology: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ పొగాకు కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై తీవ్ర విమర్శలు రావటంతో ఆ కాంట్రాక్టు రద్దు చేసుకున్నాడు. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తానని ప్రకటించాడు. విమల్ ఇలాచీ కాంట్రాక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ ఎండోర్స్‌మెంట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏదైనా విలువైన సామాజిక కార్యక్రమానికి వినియోగిస్తానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు అక్షయ్. అజయ్‌దేవ్‌గన్, షారుఖ్‌లతో కలిపి ఈ ప్రాడక్ట్ కోసం యాడ్‌లో నటించాడు అక్షయ్.
బాలీవుడ్‌లో ఎందరు హీరోలున్నా అక్షయ్ కుమార్‌ది ప్రత్యేక స్థానం. అక్షయ్ స్టంట్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవాల్సిందే. దాదాపు వంద చిత్రాలకు పైగా నటించిన ఘనకీర్తి ఆయన సొంతం. అనేక జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు. 1991లో సౌగంధ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఖిలాడీ చిత్రంతో యాక్షన్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు అక్షయ్.
ఆ తరువాత పలు రొమాంటిక్ సినిమాల్లోనూ నటించి హిట్స్ సాధించాడు. ధడ్‌కన్, అందాజ్, నమస్తే లండన్ లాంటి చిత్రాలతో యువతుల హృదయాలు కొల్లగొట్టాడు. కామెడీ పండించటంలోనూ అక్షయ్ దిట్ట. హేరా ఫేరీ, ముఝ్‌సే షాదీ కరోగీ, భూల్ భులైయ్యా, సింగ్ ఈజ్ కింగ్ లాంటి చిత్రాలతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు అక్షయ్.
సామాజిక స్పృహ కలిగించే కథాంశాలతో రిస్క్ తీసుకుని మరీ హిట్ సినిమాలు తీశాడు. టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ లాంటి చిత్రాలతో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నాడు. 2020లో ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బాలీవుడ్ హీరోగా నిలిచాడు.
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో 2.0లో పక్షిరాజు పాత్రలో నటించి మెప్పించాడు అక్షయ్. అనేక టీవీ రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించాడు.
2001లో బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియాల కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
తాజాగా పాన్ మసాలా యాడ్ చేసిన అక్షయ్‌ను... పద్మశ్రీ తీసుకుని పొగాకు ప్రమోట్ చేస్తావా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ కావటంతో అక్షయ్ తన నిర్ణయం మార్చుకున్నాడు. ఏ రకమైన పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు ఇకపై ప్రచారకర్తగా వ్యవహరించబోనని ప్రకటించాడు. భవిష్యత్తులోనూ జనాల ప్రాణాలను హరించే ఎలాంటి ఉత్పత్తులకూ ఎట్టి పరిస్థితిలోనూ ప్రచారం చేయనని ప్రకటించాడు. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుంది. అయితే ఇకపై అలాంటి ప్రకటనల్లో నటించనంటూ అక్షయ్ తన నోట్‌లో రాసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.
అక్షయ్ ప్రస్తుతం రామ్ సేతు, రక్షా బంధన్, ‘ఓ మై గాడ్ 2’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. దక్షిణాదిలో హిట్టయిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘రాక్షసుడు’, ఊసరవెల్లి’, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చిత్రాల రీమేక్స్‌లో అక్షయ్ హీరోగా నటించనున్నాడు. దాంతో పాటు 1971 యుద్ద నేపథ్యంలో ‘గూర్క’ సినిమా చేస్తున్నాడు అక్కీ. ఇక ఇప్పటికే ఈ జాబితాలో మరో ఇద్దు హిందీ నటులు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ పాన్ మసాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీరిపై కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు, మీమ్స్ వస్తున్నాయి. గతంలో పాన్ మసాలా ప్రకటనల కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను సైతం కొన్ని పొగాకు ఉత్పత్తుల కంపెనీలు సంప్రదించాయని.. కానీ అల్లు అర్జున్ (allu arjun) సున్నితంగా అలాంటి ఆఫర్లను తిరస్కరించాడు.
Read Also: Netflix New Plans: నెట్‌ఫ్లిక్స్ కొత్త మార్కెటింగ్ స్ట్రాటెజీ, త్వరలో తగ్గనున్న సబ్‌స్క్రిప్షన్ ధరలు
Read Also: Gangubai Kathiawadi: ఆలియాభట్ గంగూబాయి వచ్చేస్తోంది.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook