Netflix New Plans: నెట్‌ఫ్లిక్స్ కొత్త మార్కెటింగ్ స్ట్రాటెజీ, త్వరలో తగ్గనున్న సబ్‌స్క్రిప్షన్ ధరలు

Netflix New Plans: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు వ్యూహం మార్చుతోంది. సబ్‌స్క్రైబర్లను నిలుపుకునేందుకు మార్కెటింగ్ స్ట్రాటెజీ మార్చక తప్పడం లేదని చెబుతోంది. ఈసారి నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్స్ ఎలా ఉంటాయంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2022, 08:52 AM IST
  • సబ్‌స్క్రైబర్లను నిలుపుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్స్ త్వరలో
  • ఇకపై తగ్గనున్న నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలు
  • 2022 జనవరి-మార్చ్ మధ్యలో నెట్‌ఫ్లిక్స్‌కు దూరమైన 2 లక్షలమంది చందాదారులు
Netflix New Plans: నెట్‌ఫ్లిక్స్ కొత్త మార్కెటింగ్ స్ట్రాటెజీ, త్వరలో తగ్గనున్న సబ్‌స్క్రిప్షన్ ధరలు

Netflix New Plans: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు వ్యూహం మార్చుతోంది. సబ్‌స్క్రైబర్లను నిలుపుకునేందుకు మార్కెటింగ్ స్ట్రాటెజీ మార్చక తప్పడం లేదని చెబుతోంది. ఈసారి నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్స్ ఎలా ఉంటాయంటే..

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఓటీటీ వేదికల సంఖ్య చాలా ఎక్కువ. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే జీ5, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, సోనీ లివ్, ఆహా వంటివి ఉన్నాయి. ఈ అన్ని ఓటీటీ వేదికల్లో నెట్‌ఫ్లిక్స్ కాస్త ప్రత్యేకం. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రకటనలుండవు. వినోదమే ప్రాధాన్యత. ఇదే ఆ సంస్థ ఉద్దేశ్యం కూడా. అయితే ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలకనుంది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. త్వరలో సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటెజీతో రానుంది.

గత కొద్దికాలంగా నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 లక్షల మంది చందాదారుల్ని కోల్పోయింది. ఇది ఆ సంస్థకు ఊహించని షాక్. భారీగా చందాదారుల్ని కోల్పోవడం వెనుక కారణాల్లో ఆ సంస్థ ప్యాకేజ్ ప్రైసింగ్ ఒకటని తెలుస్తోంది. మిగిలిన వాటితో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కాస్త ఎక్కువే ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రకటనలు ఉండకపోవడంతో చందాదారుడు చెల్లించాల్సిన ధర ఎక్కువుంటుంది. బహుశా ఈ కారణంతో చాలామంది చందాదారులు జారుకుని ఉండవచ్చని తెలుస్తోంది. అందుకే ఈసారి కంపెనీ వ్యూహం మార్చనుంది. 

చందాదారుల్ని నిలుపుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు చౌక‌ప్లాన్స్ ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. చౌక  ప్లాన్స్ ప్రవేశపెట్టాలంటే..ఆర్ధికంగా దెబ్బతినకుండా ప్రకటనలు ఆహ్వానించాల్సి వస్తుంది. ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్ ప్రకటనలతో కూడిన చౌక ప్లాన్స్ ప్రవేశపెట్టనుంది. 2022 జనవరి-మార్చ్ మధ్య 2 లక్షలమంది సబ్‌స్క్రైబర్లను సంస్థ కోల్పోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరో 2 లక్షలమంది తగ్గవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. చందాదారులు తగ్గడంతో మొన్న తాజాగా నెట్‌ఫ్లిక్స్ షేర్ 26 శాతం తగ్గిపోయింది. దాంతో కంపెనీ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. కొత్తగా చందాదారుల్ని ఆకర్షించేందుకు , ఉన్నవారిని నిలుపుకునేందుకు చౌక ప్లాన్స్ తప్పదని నిర్ణయించింది.

Also read:Flipkart Cooling Days Sale: ఫ్లిప్ కార్ట్ కూలింగ్ డేస్ సేల్.. రూ.21 వేలకే వోల్టాస్ ఏసీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News