డెహ్రాడూన్‌ : డొక్లామ్‌లో ఎలాంటి పరిస్థితులైనా దీటుగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని భారత రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం చెప్పారు. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో డొక్లామ్ సమస్యపై నిర్మలా సీతారామన్ కూడా అంతే ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం భారత రాయబారి గౌతమ్‌ బంబావాలే మాట్లాడుతూ.. భారత సరిహద్దులో స్టేటస్‌ క్యూను ఒకవేళ చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డొక్లామ్ లాంటి ఘటనలే పునరావృతం అవుతాయని అన్నారు. 


డొక్లామ్ ప్రాంతంలో చైనా ప్రభుత్వం హెలికాప్టర్లు, సెంట్రీ పోస్టులు, ట్రెంచెస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో తెలిపారు. గతేడాది జూన్‌ 16 నుంచి ఆగస్టు 18 వరకూ చైనా - భారత్‌ల మధ్య డొక్లామ్ విషయమై తీవ్ర సమస్య నెలకొన్న విషయం తెలిసిందే.