Allahabad high court: మతాంతర వివాహాల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన నేపధ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇద్దరు మేజర్ల మధ్య జరిగిన వివాహాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేయడమే దీనికి కారణం..అసలేం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్ ( Uttar pradesh ) తో సహా కొన్ని రాష్ట్రాలు మత మార్పిడి చట్టాన్ని( Anti conversion bill ) తీసుకొచ్చాయి. ఇందులో భాగంగానే మతాంతర వివాహాల్ని రద్దు చేసింది యూపీ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు కీలకంగా మారింది. మేజర్లైన ఇద్దరు యువతీ యువకుల వివాహాన్ని అడుకునే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారి స్వేచ్ఛను హరించే హక్కు, అధికారాలు ఆ కుటుంబాలకు కూడా లేదని తీర్పునిచ్చింది. జస్టిస్ శ్రీవాస్తవతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. 


లక్నో ( Lucknow ) కు చెందిన ఇద్దరు యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఇద్దరినీ కుటుంబసభ్యులు వేధించసాగారు. వివాహాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో..హైకోర్టును ఆశ్రయించింది ఆ జంట. రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. మొత్తం వ్యవహారంపై  విచారణ జరిపిన కోర్టు బాధితులకు బాసటగా నిలిచింది. కుటుంబాల తీరును తప్పుబట్టింది. యువతీ, యువకుల స్వేచ్ఛను హరించే హక్కులేదని తేల్చింది. కొత్త దంపతులకు పోలీసు భద్రతను కల్పించాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించింది కోర్టు. మతాంతర వివాహల్ని రద్దు చేస్తూ యూపీ ప్రభుత్వం చట్టం తెచ్చిన నేపధ్యంలో అలహాబాద్ హైకోర్టు ( Allahabad High Cout ) తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. 


Also read: COVID-19 New Strain: 90కి చేరిన కోవిడ్ న్యూ స్ట్రేయిన్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook