ప్రతీ ఏడాది దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రత్యేక ఆఫర్స్ అందిస్తున్న అతి పెద్ద ఆన్‌లైన్ రీటేల్ దిగ్గజం అమెజాన్ ఎప్పటిలాగే ఈసారి దసర పండగకు కుడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో వినియోగదారుల ముందుకు రానున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ కొనసాగనుంది. ఈ సేల్‌లో 3.80 లక్షల మంది విక్రయదారులు భారీ సంఖ్యలో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌ను తక్కువ ధరలకే అందించనున్నట్టు అమెజాన్ తమ ప్రకటనలో పేర్కొంది. 


ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి మరో 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నట్టు సంస్థ స్పష్టంచేసింది. అంతేకాకుండా, అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేసేవారికి రూ.300 క్యాష్‌బ్యాక్ ఆఫర్ సైతం వర్తించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ఇదిలావుంటే, ఆన్‌లైన్‌లో మరో పెద్ద రీటేల్ దిగ్గజంగా పేరున్న ఫ్లిప్‌కార్ట్ సైతం బిగ్ బిలియన్ డేస్ సేల్‌‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.