చెన్నై: అత్యవసర సేవల విభాగంలో ఉన్న ఓ అంబులెన్సును సీఎం కాన్వాయ్ అడ్డగించిందని ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ముఖ్యమంత్రి పళనిస్వామి, నగర పోలీసులు తమపై వస్తున్న ఈ ఆరోపణలను ఖండించారు. అంబులెన్స్‌లో రోగి లేరని, అయినప్పటికీ అటువంటి పరిస్థితి తాము ఎదుర్కోలేదని అన్నారు. సాధారణంగా ఇలాంటి వాటికి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తుంటామని అన్నారు. ఇదే అంశంపై సీఎం పళనిసామి స్పందిస్తూ ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం అత్యవసర విభాగంలో విధులు నిర్వహించే ఈ విపత్కర పరిస్థితుల్లో అంబులెన్సును ఆపవద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇది కూడా చదవండి: ఒకే ఆస్పత్రిలో 33 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్


మరోవైపు లాక్ డౌన్ కొనసాగున్నప్పటికీ తమిళనాడులో ప్రజలు యధేశ్చగా ప్రయాణాలు కొనసాగిస్తుండటం, నగరంలో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ వంటివి ఏర్పడటం ఆందోళన కలిగిస్తోందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. డీఎంకే సీనియర్ నాయకురాలు కనిమోళి ఇదే అంశంపై ట్వీట్ చేస్తూ..  అభినందనలు సీఎం అంటూ లాక్ డౌన్ నిర్వహిస్తున్న పరిస్థితిపై మండిపడ్డారు. చెన్నై నగర ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం అంబులెన్సులను నిలిపివేసారని, మీ వినయం అద్భుతమైనదని ట్వీట్ చేశారు. 


ఇది కూడా చదవండి: ఆ అమ్మాయిలతోనే సుఖం, సంతోషం: శ్రీరెడ్డి


రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని చెన్నైతో సహా ఐదు నగరాల్లో లాక్డౌన్ కఠినతరం చేయాలని ముఖ్యమంత్రి పోలీసు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ఇప్పటివరకు 1,885 కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. వారిలో 1,020 మంది రోగులు కోలుకోగా, 26 మంది మరణించారు. . జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..