ఒకే ఆస్పత్రిలో 33 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

ఆస్పత్రులలో పనిచేస్తోన్న వైద్య సిబ్బందిలో కొన్ని చోట్ల, కొంతమంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలో 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిన నేపథ్యంలో అదే ఆస్పత్రికి చెందిన మరో 39 మంది సిబ్బందిని క్వారంటైన్‌కి తరలించిన సంగతి తెలిసిందే.

Last Updated : Apr 27, 2020, 04:02 PM IST
ఒకే ఆస్పత్రిలో 33 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

న్యూ ఢిల్లీ: ఆస్పత్రులలో పనిచేస్తోన్న వైద్య సిబ్బందిలో కొన్ని చోట్ల, కొంతమంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలో 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిన నేపథ్యంలో అదే ఆస్పత్రికి చెందిన మరో 39 మంది సిబ్బందిని క్వారంటైన్‌కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి వైద్య నిపుణులు ఇంకా తేరుకోకముందే ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. మ్యాక్స్ ఆస్పత్రిలో పనిచేస్తోన్న సిబ్బందిలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది. మ్యాక్స్ ఆస్పత్రులలో పనిచేస్తోన్న వారిలో 10 వేలకు పైగా సిబ్బందికి ఆస్పత్రి యాజమాన్యం కరోనా పరీక్షలు చేయిస్తుండగా సోమవారం ఈ విషయం వెలుగుచూసింది. దీంతో వారిని సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఉన్న కోవిడ్ వార్డుకు తరలించారు. ఢిల్లీలోని బాబూ జగ్జీవన్ రాం ఆస్పత్రిలోనూ 58 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. 

Also read : KL Rahul fitness: కె.ఎల్. రాహుల్ ఫిట్‌నెస్ మంత్ర వీడియో చూస్తే మోటివేట్ అవ్వాల్సిందే

ఇదిలావుంటే, కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 27,892కి చేరగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 872గా ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News