'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో అన్ని  వ్యాపారాలు బంద్ అయ్యాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దేశవ్యాప్తంగా పోలీసులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్యావసర వస్తువుల కోసం రోజూ వెళ్లాల్సిన పరిస్థితి. కానీ లాక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా కావడం చాలా తగ్గింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి రేపటికి 21 రోజులు పూర్తవుతాయి.  కానీ ఇప్పటి వరకు కరోనా మహమ్మారి లొంగి రాలేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ పొడగించాలనే డిమాండ్లు అన్ని రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. లాక్ డౌన్  పొడగించినపక్షంలో మళ్లీ 15 రోజులపాటు కూరగాయలు, పాలు.. ఇలా నిత్యావసర వస్తువులకు ఇబ్బంది తప్పదు.


[[{"fid":"184275","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది.  గతంలో ఢిల్లీలో కాలుష్యం సందర్భంగా ఏటా విధించి సరి, బేసీ విధానాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఢిల్లీలోని అన్ని రైతు బజార్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల అందరూ వ్యాపారులకు రోజు  విడిచి రోజు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే రైతు  బజార్లలో సామాజిక దూరం పాటించడానికి వీలు పడుతుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు .. మధ్యాహ్నం 2  గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు బజార్లలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. 


అలాగే కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకువచ్చే ట్రక్కులకు కూడా సరి-బేసీ విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..