దేశ  ప్రజలు మళ్లీ మోడీ రావాలని జనాలు కోరుకుంటున్నారని.. మరోసారి మోడీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరగుతుందని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని మోడీతో కలిసి అమిత్ షా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గత ఐదేళ పాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశాం..విపక్షాలు కూడా వేలు ఎత్తి చూపే పరిస్థితి లేకుండా పాలించామన్నారు.  2014లో దేశ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని గుర్తుచేసిన అమిత్ షా ...ప్రజల ఆశీస్సులతో  ఐదేళ్ల కాలం విజయవంతంగా పాలన చేశామని అమిత్ షా  తెలిపారు


కార్యకర్తలదే ఆ ఘనత - అమిత్ షా
ఈ ఐదేళ్ల కాలంలో లక్షా ఆరు వేల శక్తి కేంద్రాల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేశామని అమిత్ షా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లారని కితాబిచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణ ఏర్పడానికి ప్రధాన కారణం కార్యకర్తలేనని ప్రశంసించారు. మహా కూటమి ప్రభుత్వంతో ఎప్పటికీ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని ఈ సందర్భంగా అమిత్‌షా అభిప్రాయపడ్డారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అమిత్ షా పేర్కొన్నారు.