Secunderabad muthyalamma idol vandalization incident: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలోకి అమ్మవారి విగ్రహాంను ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్ని మరీ ధ్వంసం చేసిన ఘటన పెను సంచలనంగా మారింది. హిందు సంఘాలంతా దీనిపై భగ్గుమంటున్నారు. అంతేకాకుండా.. నిందితుడ్ని కఠినంగా పనిష్మెంట్ చేయాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన తర్వాత ఆ ప్రదేశంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా.. ఎక్కడ కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తదితరులు దీనిపై సీరియస్ గా స్పందించారు. ముఖ్యంగా రాజాసింగ్ ను మాత్రం కనీసం ఇంటి నుంచి బైటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా... దీనిపై కేంద్రం సీరియస్ గా అయ్యినట్లు తెలుస్తొంది.


ఇటీవల కాలంలో హిందు ఆలయాలు, హిందువులను టార్గెట్ చేసుకుని కొంత మంది రెచ్చిపోతున్నారని హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. ఒకవైపు లవ్ జీహాద్, మరోవైపు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దాడులు చేస్తున్నారని హిందు సమాజం ఆగ్రహాం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.


పూర్తి వివరాలు..


మోండా మార్కెట్లోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాంను ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ అత్యంత నీచంగా ప్రవర్తించాడు. దీంతో ఈ ఘటనపట్ల ఒకవైపు హిందు సంఘాలతో పాటు, అన్ని వర్గాల ప్రజలు కూడా దీనిపై ఆగ్రహాంతో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఘటనపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తొంది.దీనిపై తెలంగాణ కేంద్ర మంత్రులతో ఫోన్ చేసి మాట్లాడరంట. ఘటన ఎలా జరిగింది.. ప్రస్తుతం హైదరబాద్ లో పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం.


అంతేకాకుండా.. హైదరబాద్ కు అదనంగా కేంద్రబలగాలను కూడా పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల నాంపల్లిలో దుర్గామాత విగ్రహాం ధ్వంసం, మళ్లీ మోండా మార్కెట్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో.. ఇలాంటి ఘటన జరగడంపై కూడా అమిత్ షా ఫైర్ అయ్యారంట. అంతేకాకుండా.. హైదరబాద్ కు కూడా వచ్చి పరిస్థితిని దగ్గర నుంచి చూసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.


Read more: Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్..


తొందరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ ఘటన  జరగటం మాత్రం జంటనగరాలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. హైద్రబాద్ పరిస్థితుల్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తొంది. మరోవైపు ఇంత జరుగుతున్న కూడా.. సీఎం రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ ఈ ఘటనపై ఇప్పటి వరకు స్పందించక పోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం కాంగ్రెస్ ను ఏకీపారేస్తున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter