Amitabh Bachchan Covid: బాలీవుడ్‌ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్  మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రముఖ గేమ్‌షో  కౌన్ బనేగా కరోడ్‌పతి షూటింగ్‌లో ఉన్న సమయంలో కరోనా బారిన పడ్డట్లు సమాచారం. ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయాన్ని అమితాబ్ ట్వీట్‌ ద్వారా తెలిపారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కరోనా బరిన పడ్డ విషయాన్ని తెలుసుకున్న  అమితాబ్ ఫ్యాన్స్‌  ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా చాలా మంది అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 రెండవసారి కోవిడ్‌ పాజిటివ్‌:


తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా రావడం ఇది రెండవసారి.. ఇంతక ముందే  బాలీవుడ్‌ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్  కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. త్వరలోనే కోలుకొని అభిమానుల ముందుకు వస్తాని తెలిపారు. అయితే అయిన హోస్ట్‌గా చేస్తున్నKBC షూటింగ్ ఆగిపోతుందా అనే విశయం తెలియాల్సి ఉంది. ఈ అంశంపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేనందు షో షూటింగ్ ఆగిపోతుందో లేదో.. విషయం కొలిక్కి రాలేదు.


2021లో జూలై 11 హీరో అమితాబ్ బచ్చన్  కోవిడ్‌ వల్ల విలే పార్లేలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డ విషయం అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ముంబై నగరంలో కేసుల పెరుగుతున్నాయి. కావున పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలుపుతున్నారు.


Also read: Todays Fuel Price: ఇవాళ ఆగస్టు 24 దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా


Also read: Todays Fuel Price: ఇవాళ ఆగస్టు 24 దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook