Todays Fuel Price: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల అస్థిరత మధ్య..రిటైల్ మార్కెట్‌లో పెట్రోల్-డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశంలో ఇంధన ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులున్నా..దేశీయంగా పెట్రోల్-డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో మూడు నెలల్నించి ఏ విధమైన మార్పు లేదు. మే 22న కేంద్ర ప్రభుత్వం ఇంధనపై ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించడంతో కాస్త ఉపశమనం లభించింది.
ఇటీవల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్ల కంటే తక్కువ వలికినా..తిరిగి వేగంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 93.52 డాలర్లకు చేరుకుంది. అటు బ్లెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లైంది. జూలై ప్రారంభంలో మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం కూడా పెట్రోల్ ధరను 5 రూపాయలు, డీజిల్ ధర 3 రూపాయలు తగ్గించింది. అంతకుముందు మే 22న మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించడంతో పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు తగ్గాయి. ఆ తరువాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర 96.72 రూపాయలు కాగా డీజిల్ ధర 89.62 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో పెట్రోల్ ధర 111.35 రూపాయలు కాగా డీజిల్ ధర 97.28 రూపాయలుంది. చెన్నైలో పెట్రోల్ ధర 102.63 రూపాయలు కాగా డీజిల్ ధర 94,24 రూపాయలుంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర 106.03 రూపాయలైతే డీజిల్ ధర 92.76 రూపాయలుగా ఉంది. ఇక తిరువనంతపురంలో పెట్రోల్ ధర 107.71 రూపాయలు కాగా డీజిల్ ధర 96.52 రూపాయలుగా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర 101.94 రూపాయలు కాగా, డీజిల్ ధర 87.89 రూపాయలుంది. భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర 96.20 రూపాయలు కాగా డీజిల్ ధర 94.76 రూపాయలుంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 109.66 రూపాయలు కాగా, డీజిల్ ధర 97.82 రూపాయలుంది.
Also read: Interest Rates on FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఎన్బీఎఫ్సీ బ్యాంకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook