Shinzo abe: జపాన్ మాజీ ప్రధానంత్రి షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్ లోని నారా పట్టణంలో పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపాడు. షింజో మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చిన అగంతకుడు నేరుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెండు బుల్లెట్లు షింజో ఛాతిలోకి దూసుకెళ్లాయి. రక్తపుమడుగులో వేదికపైనే కుప్పకూలిన షింజోను సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా చికిత్స మొదలుపెట్టకుండానే ప్రాణాలు కోల్పోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షింజో అబే హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. సభా వేదిక వెనక వైపు నుంచి నేరుగా అబే పై కాల్పులు జరుపుతున్నా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది.  షింజో అబేపై దుండగులు మొదట ఫైర్ చేసిన బుల్లెట్ మిస్ పైర్ అయింది. బుల్లెట్ రావడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో ప్రసంగం ఆపేసి వెనక్కి తిరిగి చూశారు షింజో. వెంటనే దుండగుడు మళ్లీ పైర్ చేశాడు. దీంతో రెండు బుల్లెట్లు నేరుగా షింజో అబే ఛాతీల్లో నుంచి దూసుకుపోయాయి. ఇక్కే భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. పెద్ద శబ్దంతో మొదటి బుల్లెట్ వచ్చినప్పుడే భద్రతా సిబ్బంది అప్రత్తమై షింజో అబే చుట్టూ రక్షణ కవచంలా నిలబడిచే అబే బతికేవారు.


కాని షింజో భద్రతా సిబ్బంది ఆ పని చేయలేదు. షింజోకు రక్షణగా ఉండకుండా దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే దుండగుడి కాల్పిన రెండు బుల్లెట్లు షింజో శరీరంలోకి దూసుకెళ్లాయి. అతని ప్రాణం పోయింది. దీనిపైనే స్పందించారు భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.  కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసి.. భద్రతా వైఫల్యం గురించి ఆయన  ప్రస్తావించారు. ఫస్ట్ బుల్లెట్ మిస్ ఫైర్ అయినప్పుడే సెక్యూరిటి సిబ్బంది షింజో అబేరి రక్షణ కవచంలా నిలిచుంటే అతని ప్రాణాలతో బతికేవాడరని ఆనంద్ మహీంద్ర అభిప్రాయపడ్డారు.  భద్రతా సిబ్బంది ఆ పని చేయకుండా అగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించి తప్పు చేశారని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో చెప్పారు.   



READ ALSO: Telangana Rains:వామ్మో ఇవేం వానలు..  తెలంగాణలో 85 శాతం అధిక వర్షపాతం.. ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్!   


READ ALSO: Fourth Wave Alert: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. కొత్త కేసులు ఎన్నంటే?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook