smoking inside flight: విమానంలో సిగరెట్ తాగిన ఆంధ్ర వ్యక్తి- చెన్నై ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్
smoking inside flight: ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సిగరెట్ తాగి.. తోటి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు. దీనితో అతడిని చెన్నై ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhran Man Arrested in Chennai for Smoking inside Flight: దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటంపై నిషేధం ఉంది. ఇక బస్సుల్లో, రైళ్ల వంటి వాటిలో అసలు అందుకు ఛాన్సే లేదు. విమానాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే ఓ వ్యక్తి ఈ రూల్స్‌ను బ్రేక్ చేసి ఏకంగా (Man smoking inside flight) విమానంలోనే సిగరెట్ తాగి అరెస్టయ్యాడు.
ఇదెక్కడ జరిగిందంటే..
బుధవారం రాత్రి.. కువైట్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ ఇండిగో విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అరెస్టయిన వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్‌కు (AP man arrested in Chennai) చెందిన మహమ్మద్ షరీఫ్‌గా గుర్తించారు అధికారులు. అతడి వయస్సు 57 సంవత్సరాలను తెలిపారు.
బట్టల మధ్య దాచి..
ఎయిర్ పోర్ట్ అధికారుల కంట పడకుండా.. షరీఫ్ బట్టల మధ్య పెట్టుకుని ఓ సిగరెట్ ప్యాకెట్‌ను తెచ్చుకున్నట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ఫ్లయిట్ టెకాఫ్ అయ్యాక దానిని బయటకు అంటించి తాగటం స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు షరీఫ్‌ను సిగరెట్ తాగొద్దని వారించారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
Also read: Kangana Ranaut Freedom 2014: కంగనా రనౌత్ ఓ బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గొడవ..
ఎయిర్‌లైన్స్ సిబ్బంది షరీఫ్‌కు వార్నింగ్ ఇచ్చినా.. కొద్ది సేపటికే మళ్లీ సిగరెట్ తాగటం ప్రారంభిచాడు. ఈ విషయంపై ఎయిర్పోర్ట్ సిబ్బందితో ఆ వ్యక్తి గొడవకు కూడా దిగినట్లు తెలిసింది.
దీనితో చెన్నైలో అర్ధరాత్రి విమానం ల్యాండ్ అవగానే.. అతడిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అతడు కవైట్‌లో కూళీ పని చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని సొంతూరుకు వెళ్లేందుకు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. షరీఫ్ వచ్చిన ఇండిగో విమానంలో అతడితో కలిపి మొత్తం 137 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అది కూడా ఇండిగో విమానాల్లోనే కావడం గమనార్హం. విమానంలో ఉండే మరుగుదొద్దిలో సిగరెట్ తాగి ఇద్దరు వ్యక్తులు అరెస్టయిన ఘటనలు ఉన్నాయి.
Also read: Covaxin: కొవాగ్జిన్ తీసుకున్న వారికి విదేశీ ప్రయాణాలు ఈజీ- టీకా సామర్థ్యం 77.8 శాతం!
Also read: Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook