Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం

Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021 Final) ఫైనల్ ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ టీమ్ వికెట్ కీపర్, బ్యాటర్ డెవాన్ కాన్వే (Devon Conway Injury) గాయం కారణంగా ఈ టోర్నీతో పాటు టీమ్ఇండియాతో జరిగే టీ20 సిరీస్ (IND Vs NZ T20 Series)కు దూరమయ్యాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 12:15 PM IST
Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం

Devon Conway Injury: అద్భుతమైన ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి (T20 World Cup 2021 Final) ప్రవేశించింది న్యూజిలాండ్ టీమ్. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సమయంలో ఈ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ వికెట్ కీపర్, బ్యాటర్ డెవాన్ కాన్వే (Devon Conway Injury) గాయం కారణంగా మెగాటోర్నీ ఫైనల్ కు దూరమయ్యాడు. అలాగే నవంబర్ 17 నుంచి జరగబోయే టీమ్ఇండియాతో టీ20 సిరీస్ (IND Vs NZ T20 Series)కూ అందుబాటులో ఉండట్లేదు. 

ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ (IND Vs NZ T20)లో అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టాడు కాన్వే (Devon Conway Injury). 38 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్ లో ఔటయ్యాక అసంతృప్తితో పిడికిలితో బ్యాట్ ను బలంగా బాదాడు. ఈ సమయంలోనే ఇతడి చేతివేలుకు గాయమైంది. స్కానింగ్ చేసుకోగా చిటికిన వేలు విరిగినట్లు నిర్ధరణ అయింది. దీంతో కొంతకాలం పాటు అతడికి విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. ఔటయ్యాననే చిన్న అసంతృప్తితో చేసిన తప్పిదం ఇప్పుడు కీలక ఫైనల్ పోరుతో పాటు టీమ్ఇండియాతో టీ20 సిరీస్ కు అతడు అందుబాటులో లేకుండా చేసింది.

టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)లో గాయపడిన రెండో న్యూజిలాండ్ ఆటగాడు కాన్వే (devon conway injury). ఇంతకుముందు ఈ జట్టు ఆల్రౌండర్ లూకీ ఫెర్గూసన్ (lucky ferguson injury) పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సమయంలో గాయపడటం వల్ల టోర్నీకి దూరమయ్యాడు. 

Also Read: Australia Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతి విసిరిన బౌలర్.. వీడియో వైరల్ 

Also Read: PAK vs AUS: పాకిస్థాన్​పై అద్భుత విజయంతో ఫైనల్​కు చేరిన ఆస్ట్రేలియా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News