Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో విస్తరించిన రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా పరివర్తనం చెందాయి. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతంలో ఈదురు గాలులు వీయనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఒడిశా, ఏపీ తీరంవైపుకు పయనించనుంది. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలు లేవని తెలుస్తోంది. వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం కారణంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు. అటు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి.
అదే విధంగా తెలంగాణలో కూడా రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఉరుములు,మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. రాష్ట్రంలోని నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి.
రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణ పేట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. ఎల్లుండి బుధవారం అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also read: Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ యూ టర్న్, జగన్ తప్పు లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.