Tirumala Laddu Dispute: కలియగ వైకుంఠంగా భావించే తిరుమలలో కొలువుదీరిన వెంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలు రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆరోపణల వెనుక వాస్తవాలు వెలుగుతీయాలంటూ కొందరు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు.
మొత్తం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బాధ్యుడిని చేసేందుకు చంద్రబాబు సహా కూటమి ప్రభుత్వ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ హయాంలో టెండర్ దక్కించుకున్న ఏఆర్ డెయిరీ నిర్వాకమని, టీటీడీపీ పెద్దల హస్తముందని ఆరోపిస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఆధారంగా చేసుకుని పవిత్రమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టించారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారని. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలుపుతున్నారని జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో మహా సంప్రోక్షణ చేపట్టారు. జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం, జనసేన, బీజీపీ సంయుక్తంగా చేస్తున్న ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. తాము తప్పు చేయలేదని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం కూడా చేశారు.
జగన్ తప్పు చేయలేదు
ఇదంతా ఇలా ఉంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పుతున్నాయి. కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయన జగన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో తాము జగన్‌ను తప్పుబట్టడం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారధ్యంలో ఏర్పాటైన టీటీడీ సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. నిన్న సోమవారం రాత్రి పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు తెలిపారు. లడ్డూ ఆరోపణలపై జగన్ ప్రధాని మోదీకు లేఖ రాయడంపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఈ వివాదంలో లాగాల్సిన అవసరం లేదన్నారు.
VIDEO | "There is no need to bring the honourable PM into this. Being an ex-CM (referring to YS Jagan Mohan Reddy), he could have said 'yes, go ahead and let the culprits get punished'. There is no need for him to defend. We are not blaming him; under the board constituted by… pic.twitter.com/o29cMCKEt2
— Press Trust of India (@PTI_News) September 23, 2024
ఢిల్లీ ప్రభావం పవన్‌పై పడిందా
పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఈ వ్యవహారంపై జగన్ తప్పు లేదని వ్యాఖ్యానించడం అందర్నీ ఆశ్యర్యపరుస్తోంది. ప్రధానికి జగన్ లేఖ రాసిన అంశాన్ని కూడా ప్రస్తావించడం చూస్తుంటే మొత్తం వ్యవహారంలో బీజేపీ హై కమాండ్ జోక్యం ఉండవచ్చని తెలుస్తోంది. జగన్ ప్రధానికి రాసిన లేఖ ప్రభావం చూపించి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
Also read: Pawan Kalyan Aggressive Comments: తిరుమల లడ్డూ వ్యవహారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.