IMD Rain Alert: దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజుల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉండనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీయనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీగా పిడుగులు పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ధనురా గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు. గొర్రెలు మేపుతుండగా ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం కాల్ నాయక్ తాండాలో పిడుగుపడి ఓ యువకుడు మరణించారు. ఇక ఇవాళ హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ పరిధిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. అటు పెద్దపల్లి జిల్లా రామగుండంలో కూడా భారీ వర్షం నమోదైంది.


ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో బాణాసంచా కేంద్రంపై పిడుగుపడి ఇద్దరు మరణించారు. ఇక తిరుమలలో కుండపోత వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘాట్ రోడ్డులో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కూడా వర్షాలు పడ్డాయి. రానున్న 3 రోజులు ఇదే విధంగా మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


Also read: IPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.