Kumbha mela: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృత్యువాత..

Stampede at Kumbhamela: ఉత్తరప్రదేశ్  ప్రయాగ్‌రాజ్‌లో  జరుగుతున్న కుంభమేళాలో ఘోరం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం తొక్కిసలాట జరగడంతో 17 మంది భక్తులు మరణించినట్లు సమాచారం. త్రివేణి సంగమం ఘాట్ వద్ద మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 29, 2025, 08:15 AM IST
Kumbha mela: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మంది భక్తుల మృత్యువాత..

Stampede at Kumbhamela:  ప్రయాగ్‌రాజ్‌లో  ఈరోజు ఉదయం ఘోరం చోటు చేసుకుంది. కుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో 17 మంది భక్తులు మరణించారు. చాలామంది భక్తులు గాయపడ్డారు. పరమ పవిత్రమైన మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం ఘాటు వద్దకు భారీ ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందని జాతీయ మీడియా పేర్కొంటుంది. బాధితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఆరా తీశారు.

మౌనీ అమావాస్య అమృత స్నానానికి పదికోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇక ఘటన స్థలానికి అంబులెన్సులు వచ్చాయి. గాయపడిన వారిని కుంభమేళా సెక్టార్‌ 2 కు తరలించారు. తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈరోజు అమృత స్నానం కేన్సల్‌ చేసినట్లు అఖారా పరిషద్‌ (కౌన్సెల్‌) ప్రకటించింది. అయితే, స్నానం చేసిన వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లాలని భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు.

రెండు బస్సులో 60 మందిమి వచ్చాం, మా గ్రూపులో 9 మంది ఉన్నారు. సడెన్‌గా వెనుక నుంచి ఎవరో తోసినట్లయింది. దీంతో మేము ఆ రద్దీలో చిక్కుకుపోయాం. అందరూ కింద పడిపోయారు. ఇక జనాలను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడిందని కర్నాటక నుంచి వచ్చిన ఓ భక్తురాలు తెలిపింది.

మౌనీ అమావాస్య అత్యంత పవిత్రమైనది. ఈరోజు గంగా స్నానం చేస్తారు. ఉత్తరప్రదేశ్‌ ఈ భారీ రద్దీని నియంత్రించడానికి సరైన జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఇక్కడ సెక్టార్‌ వారీగా ఆంక్షలు కూడా విధించారు. ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఈ ఘోరం జరిగింది. ఇక వీడియోల్లో కూడా  వేల మంది భక్తులు గంగా స్నానం చేయడానికి ఒక్క దగ్గర గుమిగూడిన దృశ్యాలను చూడవచ్చు. మహాకుంభమేళాలో వచ్చే ఈ మౌనీ అమావాస్య హిందూవులకు పరమపవిత్రమైంది. ఈ రోజు మౌన వ్రతం కూడా ఆచరిస్తారు. కొంతమంది ఉపవాసం చేస్తారు. త్రివేణి సంగమం వద్ద పితరులకు తర్పణాలు కూడా పెడతారు.

 

 

 

 

ఇదీ చదవండి: నుమాయిష్‌లో అనసూయ భరద్వాజ్‌.. మేడమ్‌ మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేదా?

 

 

బాగ్‌పత్‌..
నిన్న ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో కూడా లడ్డూ మహోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. జైన కమ్యూనిటీకి చెందిన ఈ ఉత్సవంలో వెదురు కర్రలతో తయారు చేసిన స్టేజీపైకి ఒక్కసారిగా వందల మంది రావడంతో వేదిక కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రగాయాలు అయ్యాయి. ఆదినాథ నిర్వాణ కార్యక్రమంలో జైన భక్తులు లడ్డూలు సమర్పించడానికి ఒక్కసారిగా వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తిరుమల తొక్కిసలాట ఘటనలో కూడా 8 మంది చనిపోయారు. ఇది తీవ్రంగా కలచివేసింది.

ఇదీ చదవండి:   స్ట్రాబెర్రీ ఈ రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు, రోజూ తింటారు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x