Tax Saving Tricks: ఇన్‌కంటాక్స్ అసెస్‌మెంట్, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ అనేవి ఎప్పుడూ కలిసే ఫైల్ చేయాల్సి ఉంటుంది. అసెస్‌మెంట్ ప్లానింగ్‌ను బట్టే రిటర్న్స్‌లో ఎంత ఆదా అవుతుందనేది ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ట్రిక్స్ పాటిస్తే ట్యాక్స్ పెద్దఎత్తున ఆదా చేయవచ్చు. దీనికోసం సరైన ట్యాక్స్ ప్లానింగ్ అవసరం.
ప్రతి సారీ ఆర్ధిక సంవత్సరం చివరికొచ్చేసరికి అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇన్‌కంటాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్ సమర్పించే సమయంలో అందరూ ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే సరైన ప్రూఫ్స్ లేకపోతే మార్చ్, ఏప్రిల్ నెలల్లో ట్యాక్స్ భారీగా కట్ అవుతుంటుంది. అందుకే ఆర్ధిక సంవత్సరం చివర్లో కాకుండా ముందు నుంచే ప్లానింగ్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదు. మీ ఖర్చులు, ట్యాక్స్ మినహాయింపులు అన్నీ లెక్కలో తీసుకుని ట్యాక్స్ ఎంత పడే అవకాశముందో లెక్కించుకోవాలి. అందుకు తగ్గట్టు ముందు నుంచే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దృష్టి సారించాలి. ట్యాక్స్ సేవింగ్ మార్గాలేమున్నాయో తెలుసుకోవాలి. ఓల్డ్ ట్యాక్స్ వర్సెస్ న్యూ ట్యాక్స్ విధానాల్లో ఏది మీ ఆదాయానికి అనుకూలంగా తెలుసుకోవాలి.
ట్యాక్స్ సేవింగ్ ట్రిక్స్
ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం ఏడాదిలో 1.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేసి మినహాయింపు పొందవచ్చు. అంతకు మించి పొందేందుకు సెక్షన్ 80 సిసిడి ప్రకారం ఎన్‌పీఎస్‌లో అదనంగా మరో 50 వేల రూపాయలు సేవ్ చేయవచ్చు. సెక్షన్ 80 సి ప్రకారం పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్సపై ఏడాదికి 1.5 లక్షలు ఆదా చేయవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ద్వారా ట్యాక్స్ ఆదా చేయవచ్చు. మీ కోసం మీ కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల పాలసీలకై మీరు చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80డి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. దీంతోపాటు పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు, హౌసింగ్ లోన్ వంటివి కూడా అప్లై అవుతాయి. సరైన ఆడిటర్ సలహా తీసుకుంటే మరింత పకడ్బందీగా ట్యాక్స్ సేవింగ్ ప్లానింగ్ చేసుకోవచ్చు.
Also read: Public Holidays: విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఆ 3 రోజులు పబ్లిక్ హాలిడేస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి