హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను ఉర్దూలోకి అనువాదం చేసిన ప్రముఖ కవి, రచయిత అన్వర్ జలాల్పురి మంగళవారం ఉదయం కెజిఎంయు ఆసుపత్రిలో గుండెనొప్పితో తుదిశ్వాస విడిచారు. 71 ఏళ్ళ అన్వర్ జలాల్పురి ఉర్దూతో పాటు సంస్కృతం, హిందీ భాషలలో కూడా సిద్ధహస్తులు. ఉద్యోగరీత్యా ఆంగ్లభాషను బోధించే అధ్యాపకుడైన జలాల్పురి ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్న ఆయన రోషనాయి కే సఫీర్, ఖరే పానీయో కా సిల్సిలా, ఖుష్బూ కి రిష్తెదారి మొదలైన హిందీ కావ్యాలెన్నో రాశారు. యూపీ హజ్ కమిటీ సభ్యులైన జలాల్పురి, యూపీ మదర్సా బోర్డుకి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ప్రతిష్టాత్మక యశ్ భారతి పురస్కార గ్రహీతైన అన్వర్ జలాల్పురి, కొన్నిరోజుల క్రితం బాత్రూంలో  జారిపడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. అలాగే లండన్ వాసైన తన కుమార్తె మరణించడంతో.. కొన్నాళ్లుగా తన సొంతఇంటిలోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో ఈ హఠాత్పరిణామం సంభవించడం విషాదకరం.