AP Elections 2024: ఏపీ ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం దగ్గరపడుతోంది. మరో ఆరో రోజుల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపరచనున్నారు. ఇక అభ్యర్థుల ప్రచారానికి నాలుగు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే అందరూ అభ్యర్థులు తమ నియోజకవర్గాలను చుట్టేయగా.. గెలుపు లెక్కల్లో బిజీగా ఉన్నారు. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ పట్టుదలతో ఉండగా.. ఈసారి గెలుపు తమదేనంటూ కూటమి నేతలు ధీమాతో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాలపై కూటమి ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో సాధ్యమైనన్నీ ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అధికార పార్టీ కూడా తమకు పట్టున్న జిల్లాల్లో ఏ మాత్రం మెజారిటీ తగ్గకుండా ఉండేందుకు గ్రౌండ్ లెవల్లో గట్టిగానే ప్లాన్ చేస్తోంది.
Also Read: Singanamala: ప్రచారంలో ఎండదెబ్బ.. మంచానికి పరిమితమైన శింగనమల టీడీపీ అభ్యర్థి
గత ఎన్నికల్లో వైసీపీకి క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం ఒకటి. ఈ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది. ఈసారి ఈ జిల్లాల్లో పొలిటికల్ హీట్ ఎక్కువగానే ఉంది. పూర్వవైభవం సాధించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రత్యేక ప్లాన్‌తో టీడీపీ వెళుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో పట్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో ఒకటి గజపతి నగరం నియోజకవర్గం.
గజపతినగరం నుంచి అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీ ఆర్థిక, అంగబలం ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ను తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపింది. 1955 నుంచి ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా టీడీపీ ఐదుసార్లు గెలుపొందగా.. కాంగ్రెస్ నాలుగుసార్లు గెలుపొందింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బొత్స అప్పలనర్సయ్య విజయం సాధించారు. ఈసారి తాను గెలుపొంది.. టీడీపీకి పూర్వవైభవం తీసుకువస్తానని ధీమగా చెబుతున్నారు కొండపల్లి శ్రీనివాస్.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధి తనను మరోసారి గెలిపిస్తుందని అప్పలనర్సయ్య చెబుతున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తనను గెలిపించాలని కోరుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణకు సోదరుడు కావడం.. స్థానికంగా పట్టు ఉండడం ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు. అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నెగిటివ్‌గా మారే అవకాశం ఉందని టాక్ వస్తోంది.
కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ మేనిఫెస్టోను వివరిస్తూ.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ఓట్లు అడుగుతున్నారు. అందరి నాయకులను కలుపుకుని వెళుతూ ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అప్పల నర్సయ్యపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి కలిసివస్తుందని.. గజపతినగరంలో తమ పార్టీ జెండాను ఎగరేస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమాతో ఉన్నారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలకుతోడు యువత నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఆయన విజయంపై నమ్మకంగా ఉన్నారు. ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న గజపతినగరంలో గెలుపు ఎవరిదో తేలిపోనుంది.
Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter