Gujarat Heroin Case: గుజరాత్ డ్రగ్స్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. గుజరాత్ ముంద్రా పోర్టులో లభ్యమైన హెరాయిన్‌పై తప్పుడు వార్తలొస్తున్నాయని స్పష్టం చేశారు. డ్రగ్స్‌తో ఏపీకు సంబంధం లేదంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో(Mundra Port)భారీగా హెరాయిన్ పట్టుబడింది.ఈ వ్యవహారానికి సంబంధించి విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. డ్రగ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గుజరాత్ హెరాయిన్ విజయవాడకు గానీ, ఏపీలోని ఇతర ప్రాంతాలకు గానీ దిగుమతి చేసుకున్నట్టుగా ఆధారాల్లేవన్నారు. ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)నుంచి ముంద్రా పోర్టుకు వేరే కన్‌సైన్‌మెంట్‌లో హెరాయిన్(Heroin)దిగుమతి చేసుకునే క్రమంలో మాత్రమే పట్టుబడిందని తెలిపారు. 


డ్రగ్స్ వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు కచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరముందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు డ్రగ్స్ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్(Gautam Sawang) మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.డ్రగ్స్‌కు సంబంధించిన అన్ని అంశాలపై డీఆర్ఐ, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు.ఉద్దేశ్యపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం మానుకోవాలని హితవు పలికారు. గుజరాత్ హెరాయిన్ (Gujarat Heroin Issue)అంశాన్ని విజయవాడకు లింక్ చేయడం సమంజసం కాదన్నారు. నేరానికి సంబంధించిన ఆనవాళ్లు ఏపీలో లేవనే విషయాన్ని డీఆర్ఐ గానీ, కేంద్ర సంస్థలు గానీ ధృవీకరిస్తున్నా..రాజకీయ నేతలు అపోహలు సృష్టించడం భావ్యం కాదన్నారు. ఆషి ట్రేడింగ్ చిరునామా మాత్రమే విజయవాడగా ఉందన్నారు. 


Also read: Ys Jagan Review: రాష్ట్రంలో తగ్గిన మద్యం అమ్మకాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి