Note for Vote case: ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలనే పిటీషన్ పై విచారణ మొదలైంది. దీనిపై కోర్టు నిర్ణయం ఎలా ఉందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఓటుకు నోటు కేసు ( Note for vote case ) లో సుప్రీంకోర్టు ( Supreme court )లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అటు హైదరాబాద్ ఏసీబీ కోర్టు ( Acb court ) లో కూడా ఈ కేసులో విచారణ ఇటీవలే ప్రారంభమైంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ( supreme court chief justice bobde ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటీషనర్ తరపున న్యాయస్థానంలో ప్రశాంత్ భూషణ్ వాదనలు విన్పించారు. ఈ అంశంపై కచ్చితమైన విచారణ తేదీని ప్రకటించాలని కోరగా..లిఖితపూర్వక ఆదేశాల్లో స్పష్టం చేస్తామన్నారు. 


ఈ కేసులో వాదన విన్పించిన ప్రశాంత్ భూషణ్..ఓటుకు నోటు కేసు ఛార్జిషీటులో చంద్రబాబు ( Chandrababu naidu ) పేరు ఏకంగా 37 సార్లు  ప్రస్తావించినా సరే..ముద్దాయిగా చేర్చలేదని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చి..సీబీఐ ( CBI ) దర్యాప్తు చేయించాలన్నారు. రాజకీయంగా ముడిపడిన కేసుల్ని త్వరగా విచారించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్బంగా ఉదహరించారు. చంద్రబాబు పేరును కేసులో చేర్చే విషయమై వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే తెలిపారు. Also read: GST: టీ బడ్డీ యజమాని కాదు..షాపింగ్ మాల్ యజమాని అట