GST: జీఎస్టీ నోటీసు బాధితులు పెరుగుతున్నారిప్పుడు. అధికార్ల నిర్లక్ష్యం మూలంగా టీ బడ్డీలు కూడా కోట్లలో జీఎస్టీ చెల్లించాలనే నోటీసులు అందుకుంటున్నారు. అదే జరిగింది ఒరిస్సాలో..
జీఎస్టీ ( GST ) ప్రారంభమైనప్పటి నుంచి వ్యాపారులకు ఆందోళన పట్టుకుంది. మరీ ముఖ్యంగా అధికార్ల నిర్లక్ష్యం మూలంగా భయం గొలిపే నోటీసులు వస్తున్నాయి. ఒరిస్సా ( Odisha ) లో ఇదే జరిగింది. ఓ టీ బడ్డీ యజమాని ( Tea stall owner served 109 crores of gst notice ) కి ఏకంగా 109 కోట్లు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు రావడంతో నిర్ఘాంతపోయాడు.
ఒరిస్సా రాష్ట్రం ఉక్కునగరమైన రూర్కెలా ( Rourkela ) కోయల్ నగర్ ప్రాంతంలో చిన్న టీ బడ్డీ నడుపుకుంటున్నారు కార్తీక్ కమిల అనే వ్యక్తి. ఇతను 109 కోట్ల జీెస్టీ బకాయి చెల్లించాలని నోటీసు వచ్చింది. వాస్తవానికి కార్తీక్ సంతకం కూడా చేయలేని నిరక్షరాస్యుడు. ఉన్నది కుటుంబ పోషణ కోసం ఆ చిన్న బడ్డీ మాత్రమే. అయితే నోటీసులో బడా షాపింగ్ మాల్ యజమానిగా జీఎస్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. అగ్రిమెంట్ కింద భవంతిని అద్దెకిచ్చినట్టుగా ఉంది. అందులో కార్తీక్ కమిల సంతకం కూడా ఉంది.
Also read: Watch Video: భవనంపై నుంచి పాదచారులపై కూలిన పిల్లర్
కార్తీక్.. రూర్కెలా కోయల్ నగర్ లోని లింగరాజ్ ట్రేడింగ్ కంపెనీ షాపింగ్ మాల్ ( lingaraj trading company shopping mall ) ఆవరణలో టీ బడ్డీ నడుపుకుంటున్నాడు. టీ బడ్డీతో పాటు చిన్నగా కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని ట్రేడింగ్ కంపెనీ యజమానిగా పేర్కొనడం, భారీ భవంతి నడుపుతున్నట్టు ఉండటంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఈ వార్త కాస్తా వైరల్ కావడంతో..జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ( Gst intelligence director general ) ఆధ్వర్యాన క్షేత్రస్థాయితో విచారణ చేపడుతున్నారు.
క్షేత్రస్థాయి విచారణలో కార్తీక్ కమిల నిజంగానే టీ బడ్డీ యజమానిగా తెలిసింది. కార్తీక్ విద్యుత్ బిల్లులు జత చేసి బూటకపు జీఎస్టీ నోటీసు జారీ చేయించినట్టు భావిస్తున్నారు. గతంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు, విద్యార్ధులు , చిరు వ్యాపారులకు ఇలాంటి నోటీసులే వచ్చిన పరిస్థితి ఉంది.
Also read: Kamal haasan: రజనీకాంత్‌కు కమల్ హాసన్ ఆహ్వానం..కూటమిలోకి పిలుపు