ఢిల్లీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. 'కరోనా వైరస్'ను ఎదుర్కోవడంలో వైద్యులు, పారామెడికల్, పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించింది. వారు  ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల  కోసం 24 గంటలు సేవ చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం  చేశారు. అంతే కాదు.. నిత్యం కోవిడ్ 19  రోగులతో గడుపుతూ చికిత్స అందిస్తున్న వారి ప్రాణాలు ఎప్పుడూ రిస్క్ లోనే ఉంటాయన్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు.


దిగొచ్చిన గ్యాస్ బండ ధర


ఒకవేళ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న  వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందిస్తామని తెలిపారు. వారు చేస్తున్న పనిపట్ల, వారిపట్ల గౌరవ భావంతోనే ఇది చేస్తున్నామని కేజ్రీవాల్ అన్నారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్నా..ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్నా ఎలాంటి సంబంధం లేదన్నారు. వారి పని పట్ల గౌరవ భావమే తమకు ముఖ్యమన్నారు ముఖ్యమంత్రి..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..