ఢిల్లీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ప్రచారం చేస్తుండగా. . ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది.  ఈ క్రమంలో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ చేసిన వ్యాఖ్యలు .. ఢిల్లీ రాజకీయాలను వేడెక్కించాయి.  ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారని పర్వేష్ వర్మ అన్నారు.  దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కుమార్తె హర్షిత కేజ్రీవాల్ స్పందించారు.  ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరూ చేయని పనులు మా నాన్న చేశారని ఆమె చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటేనే అసహ్యం వేస్తోందన్నారు. రాజకీయాలంటే బురదమయమే .. కానీ మరీ ఇంత దిగజారుడుతనంగా ఎలా మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో పరిశుభ్రమైన మంచినీరు అందించినందుకు.. నాణ్యమైన విద్య అందించినందుకు.. మెరుగైన వైద్యం అందించినందుకు .. కేజ్రీవాల్ ను ఉగ్రవాది అని పిలుస్తారా .. అని ఎదురు ప్రశ్నించారు.  


తన తండ్రి సమాజ సేవ చేయడంలో ముందున్నారని ..  హర్షిత కేజ్రీవాల్ తెలిపారు. రోజూ ఉదయమే భగవద్గీత, హనుమాన్ చాలీసా చదవడం ఆయనకు అలవాటు అన్నారు. అలాంటి వ్యక్తిని ఉగ్రవాది అని అనడాన్ని హర్షిత తప్పు పట్టారు.