జయ హో .. కేజ్రీవాల్ జీ
దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడుతున్న సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పంజాబ్ లోని లుథియానాలో ప్రత్యేకంగా ఆయన కోసం మైనపు విగ్రహం చేయించారు. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయన మైనపు విగ్రహం ముందు సంబరాలు చేసుకున్నారు. ఆయన మైనపు విగ్రహానికి స్వీట్లు తినిపించారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.
[[{"fid":"182054","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మరోవైపు ఢిల్లీలో గతంలో ఉన్న కేబినెట్ కొనసాగుతుందని పట్‌పర్‌గంజ్ ఎమ్మెల్యే మనీష్ సిసోడియా తెలిపారు. గతంలో ఉన్న కేబినెట్‌నే కొనసాగించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇష్టపడుతున్నారని చెప్పారు. గతంలో ఉన్న కేబినెట్ ప్రజలకు మంచి పనులు చేసిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన పనుల వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టిందని తెలిపారు.