IAF MiG 21 Crashes in Rajasthan: భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 (MiG-21) యుద్ధ విమానం సోమవారం ఉదయం కుప్పకూలింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ సమీపంలో ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పారాచూట్ సాయంతో విమానం నుంచి దూకి పైలట్ ప్రాణాలను కాపాడుకున్నాడు. సూరత్‌గఢ్‌ నుంచి టేకాఫ్‌ అయిన మిగ్‌-21 విమానం.. డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు ఘటన స్థలంలోనే మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విమానం కుప్పకూలిన సమయంలో ఇంట్లో నలుగురు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, పురుషుడు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల యుద్ధవిమనాలు, ఆర్మీ హెలికాఫ్టర్లు కూలిపోతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్ సు-30, మిరాజ్ 2000 ట్రైనింగ్ టైమ్‌లో కుప్పకూలిపోయాయి. ఈ ఘటన ఓ పైలట్ మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా.. మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది. ట్రైనింగ్ టైమ్‌లో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో ఏప్రిల్‌లో కొచ్చిలో మరో ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కూడా కూలిపోయింది. 


కిష్త్వార్ జిల్లాలోని మార్వా తహసీల్‌లోని మారుమూల ప్రాంతమైన మచ్చా గ్రామ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోగా.. ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఆర్మీ అధికారులు వెంటనే స్పందించింది సహాయక చర్యలు ప్రారంభించారు. అదేవిధఃగా మార్చి నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లోని మాండ్లా కొండ ప్రాంతం సమీపంలో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ కూలిపోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు డిసెంబర్ 2021లో సాంకేతిక లోపంతో ఆర్మీ హెలికాఫ్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సహాయక సిబ్బంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాద ఘటన తరువాత కూడా వరుసగా ఆర్మీకు సంబంధించిన హెలికాఫ్టర్లు, భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు కూలిపోతుండడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


Also Read: KKR Vs PBKS Deam11 Prediction 2023: కేకేఆర్ ఓడితే ఇంటికే.. నేడు పంజాబ్‌తో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..  


Also Read: RR vs SRH IPL 2023 Highlights: హైఓల్టెజ్ థ్రిల్లింగ్ మ్యాచ్.. రాజస్థాన్ కొంపముంచిన నోబాల్.. ఆఖరి బంతికి సిక్సర్‌తో హైదరాబాద్ విక్టరీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి