10 సార్లయినా ప్లాస్మా ఇస్తా..!!
`కరోనా వైరస్` వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో తన వంతు సహకారం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని తబ్లీగీ జమాత్ కు చెందిన ఓ సభ్యుడు తెలిపారు. ఇప్పటికి రెండుసార్లు ప్లాస్మా ఇచ్చానని వెల్లడించారు. మరో 10 సార్లయినా ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో తన వంతు సహకారం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని తబ్లీగీ జమాత్ కు చెందిన ఓ సభ్యుడు తెలిపారు. ఇప్పటికి రెండుసార్లు ప్లాస్మా ఇచ్చానని వెల్లడించారు. మరో 10 సార్లయినా ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అర్షద్ అహ్మద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆయన హరియాణాలోని ఝాఝర్ ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత నెగెటివ్ రావడంతో పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారు. ఐతే ప్లాస్మా థెరపీ ద్వారా ప్రస్తుతం కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే కరోనాపాజిటివ్ గా నిర్ధారణ అయి.. నయం చేసుకున్నవారు రక్తదానం చేయాలని వైద్యులు, ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈ పిలుపు మేరకు అర్షద్ అహ్మద్ కూడా రెండుసార్లు రక్తదానం చేశారు. మరో 10 సార్లయినా రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఆయన బతికే ఉన్నారు..!!
మరోవైపు ప్రభుత్వాలు చెప్పిన విధంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని అర్షద్ అహ్మద్ కోరారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఇంట్లోనే ఉండి నమాజ్ చేసుకోవాలన్నారు. మసీదులకు వెళ్లవద్దని సూచించారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో తమను వైద్యులు చక్కగా చూసుకున్నారు. ఇంట్లో ఎలా ఉండేవాళ్లమో .. అదే విధంగా ఉండి చికిత్స తీసుకున్నామని తెలిపారు. రోజూ 3 సార్లు తమకు పరీక్షలు నిర్వహించారని చెప్పారు. వైద్యులకు సహకరిస్తేనే కరోనా మహమ్మారి భూతం మన నుంచి పారిపోతుందని తెలిపారు.